ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో ఎన్నారై వ్యాపారవేత్త అతి తెలివి.. ఉద్యోగుల జీతాలను తగ్గించి లాభ పడదామనుకుంటే పెద్ద షాకే తగిలిందిగా..!

ABN, First Publish Date - 2023-02-11T21:29:39+05:30

అమెరికాలో అతి తెలివి ప్రదర్శించిన ఓ ఎన్నారై వ్యాపారవేత్త చివరకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో అతి తెలివి ప్రదర్శించిన ఓ ఎన్నారై వ్యాపారవేత్త చివరకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఉద్యోగుల జీతాలను తగ్గించి లాభపడిన ఆమెపై అక్కడి కార్మిక శాఖ జరిమానా విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే ఏమీ పటేల్ అనే ఎన్నారై.. మిషిగన్ రాష్ట్రంలో(Michigan) మూడు నర్సింగ్ హోమ్‌లను నిర్వహిస్తున్నారు. అయితే.. ఏమీ సంస్థల్లో 45 మేనేజర్లుకు చెల్లించాల్సిన అదనపు జీతాన్ని ఆమె ఎగ్గొట్టిందని ఆరోపణ. అధికారుల విచారణలో ఇది రుజువవడంతో లేబర్ డిపార్ట్‌మెంట్(Labour department) ఆమెకు భారీ షాకచ్చింది. ఉద్యోగులకు బాకీ ఉన్న మొత్తాన్ని జరిమానాతో కలిపి మొత్తం 69 వేల డాలర్లను చెల్లించాలంటూ(Back wages) ఆదేశించింది.

అదనపు పని గంటల జీతాన్ని ఎగ్గొట్టేందుకు ఏమీ ఓ కొత్త వ్యూహం పన్నారని అధికారులు గుర్తించారు. ఆమె తన ఉద్యోగులకు పని గంటల వారీగా డబ్బులిచ్చేవారు. అయితే.. ఉద్యోగి ఎవరైనా అదనంగా పనిచేసిన సందర్భాల్లో ఆ వ్యక్తిని నెలజీతంపై పనిచేస్తున్నట్టుగా పరిగణిస్తూ తక్కువ జీతం చెల్లించేవారు. ఇలా తనకు అనుకూలంగా పలుమార్లు ఉద్యోగుల స్టేటస్‌ను మారుస్తూ లాభపడ్డారు. ఇది లేబర్ డిపార్ట్‌మెంట్ దృష్టికి వెళ్లడంతో కార్మిక శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సంస్థలు తమ ఉద్యోగుల స్టేటస్‌ను ఇష్టారీతిన మార్చడమంటే నిబంధనలు ఉల్లంఘించడమే(Labor code violations)’’ అని వ్యాఖ్యానించింది. పటేల్‌పై సివిల్ మానెటరీ పెనాల్టీ కింద 7,983 డాలర్ల జరిమానా విధించింది. ఇక 2018లో ఏమీ తన వద్ద ఉన్న డ్రైవర్లకు వెయిటింగ్ చార్జీలు కూడా చెల్లించలేదని అధికారులు గుర్తించారు. 2015లో సిబ్బంది శిక్షణకు సంబంధించిన చార్జీలను కూడా ఆమె చెల్లించలేదన్నట్టు తేలింది.

గతేడాది డెట్రాయిట్ డిస్ట్రిక్ట్ కార్యాలయం.. ఉద్యోగులు కోల్పోయిన మొత్తం 2.2 మిలియన్ డాలర్ల మేరకు వారికి దక్కేలా చేసింది. ఇందులో సుమారు 5 లక్షల డాలర్లను వైద్యసిబ్బంది దక్కించుకున్నారు. ఈ క్రమంలో సుమారు మూడు వెల మంది వర్కర్లకు డెట్రాయిట్ కార్యాలయం ద్వారా న్యాయం జరిగింది.

Updated Date - 2023-02-11T21:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising