ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Microsoft Layoff: 21 ఏళ్లు పనిచేసిన ఉద్యోగిని తొలగించిన మైక్రోసాఫ్ట్.. భారతీయుడి భావోద్వేగపూరిత పోస్ట్

ABN, First Publish Date - 2023-01-21T12:35:54+05:30

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) రెడీ అయిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) రెడీ అయిన విషయం తెలిసిందే. ప్రధానంగా మానవ వనరులు, ఇంజినీరింగ్ విభాగాలలో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే, కంపెనీలోని సుమారు 5 శాతం మంది ఉద్యోగులపై మైక్రోసాఫ్ట్ తాజాగా వేటు వేయాలని నిర్ణయించింది. అంటే మొత్తంగా 11వేల మంది వరకు ఉద్యోగులను ఇప్పుడు ఇంటికి పంపనుందన్నమాట. ఇప్పటికే తొలగింపులు మొదలయ్యాయి కూడా. దీనిలో భాగంగా ఆ కంపెనీలో గత 21ఏళ్లుగా పని చేస్తున్న ఓ భారత వ్యక్తిపై కూడా తాజాగా వేటు పడింది. మైక్రోసాఫ్ట్‌లో 21ఏళ్లు సేవలు అందించిన భారతీయ వ్యక్తి ప్రశాంత్ కమానీని (Prashant Kamani) ఉద్యోగం నుంచి తొలగించింది.

ఈ సందర్భంగా ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత పోస్ట్ చేశాడు. "నా కాలేజీ తర్వాత తొలి ఉద్యోగం మైక్రోసాఫ్ట్‌లోనే. నేను కొంచెం ఆందోళనగా, ఎంతో ఉత్సాహంగా మొదట అమెరికాలో అడుగుపెట్టడం నాకు ఇప్పటికీ గుర్తుంది. 21 ఏళ్ల పాటు కంపెనీలో వేర్వేరు హోదాల్లో పనిచేశాను. పని నేర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ ఎన్నో అవకాశాలిచ్చింది. నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. మైక్రోసాఫ్ట్ నా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి, విస్తరించడానికి నాకు అనేక అవకాశాలను ఇచ్చింది. నేను వాటిని పూర్తిగా ఉపయోగించుకోగలిగాను. నా కెరీర్‌లో నేను పొందిన అనుభవ సంపదను కేవలం సంవత్సరాల్లో కొలవలేము. అది నిజంగా అపరిమితమైంది. అన్నింటికీ నేను మైక్రోసాఫ్ట్‌కు నిజంగా కృతజ్ఞుడను. ధన్యవాదాలు" అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక కమానీ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అలాగే సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడికి మొదటి ఉద్యోగమే మైక్రోసాఫ్ట్‌లో రావడంతో యూఎస్‌కు (US) వెళ్లడం జరిగింది.

Updated Date - 2023-01-21T12:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising