Indian Expat: కువైత్‌లో విషాద ఘటన.. రోజులానే డ్యూటీకి వెళ్తున్న భారతీయ ప్రవాసుడికి ఊహించని ప్రమాదం..
ABN, First Publish Date - 2023-04-07T09:26:02+05:30
కువైత్‌లో (Kuwait) విషాద ఘటన చోటు చేసుకుంది. భారతీయ ప్రవాసుడు (Indian Expat) రోడ్డు ప్రమాదంలో (Road Acciddent) చనిపోయాడు.
కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) విషాద ఘటన చోటు చేసుకుంది. భారతీయ ప్రవాసుడు (Indian Expat) రోడ్డు ప్రమాదంలో (Road Acciddent) చనిపోయాడు. మృతుడిని 58 ఏళ్ల జోసెఫ్ పుతియారాగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం అలప్పుజకు (Alappuzha) చెందిన జోసెఫ్ పుతియారా గత కొనేళ్లుగా కువైత్‌లో ఉంటున్నాడు. అక్కడి సౌత్ సుర్రాలోని ఎంఈడబ్ల్యూ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రీసిటీ అండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు. బుధవారం రోజులానే డ్యూటీకి వెళ్తున్న క్రమంలో ఆఫీస్ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ వాహనం జోసెఫ్ పుతియారాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఈ ఘటనతో అతడి స్వస్థలం అలప్పుజలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Kuwait: ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అంటున్న కువైత్.. 3నెలల్లో 9వేల మందిని వెళ్లగొట్టింది.. అందులోనూ మనోళ్లే అధికం..!
Updated Date - 2023-04-07T09:26:02+05:30 IST