ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన భారత సంతతి వ్యక్తి అదృశ్యం

ABN, First Publish Date - 2023-05-21T16:08:45+05:30

ఎవరెస్ట్ పర్వతారోహణకు నేపాల్ వెళ్లిన ఓ భారత సంతతి వ్యక్తి అదృశ్యమయ్యారు. శీతలవాతావరణం కారణంగా ఆయన అనారోగ్యం పాలయి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక దళాలను దింపాలంటూ నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఎవరెస్ట్ పర్వతారోహణకు(Mount Everest) నేపాల్ వెళ్లిన ఓ భారత సంతతి వ్యక్తి(Indian Origin) అదృశ్యమయ్యారు(Missing). శీతలవాతావరణం కారణంగా ఆయన అనారోగ్యం పాలయి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక దళాలను దింపాలంటూ నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సింగపూర్‌కు(Singapore) చెందిన శ్రీనివాస్ సైనీస్ దత్తాత్రేయ స్థానిక రియల్ ఎస్టేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఏప్రిల్ 1న ఆయన నేపాల్ వెళ్లారు. కాగా, శుక్రవారం శిఖరం చేరుకున్న అనంతరం ఆయన శాటిలైట్ ఫోన్ ద్వారా భార్యకు ఫోన్ చేశారు. తిరిగి రావడం కష్టంగా మారొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే శ్రీనివాస్‌కు బేస్‌క్యాంప్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రత్యేక దళంతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంది. ఈ మేరకు change.org వెబ్‌సైట్‌లో ఓ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించింది. పర్వతంపై ఉన్న శీతలవాతావరణంగా కారణంగా శ్రీనివాస్ అనారోగ్యం పాలై ఉంటాడని ఆయన బంధువు దివ్య భరత్ పేర్కొన్నారు. తన బృందం వెంట కిందకు దిగే క్రమంలో అతడు అనారోగ్యంతో వెనకబడిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ 8500 అడుగుల ఎత్తున ఉన్న సమయంలో బేస్ క్యాంప్‌తో సంబంధాలు తెగిపోయని పేర్కొన్నారు.

సింగపూర్ మీడియా కథనాల ప్రకారం, శనివారం షెర్పాల (నిపుణులైన పర్వతారోహకులు) బృందం ఒకటి గాలింపు చర్యలు ప్రారంభించింది. అయితే, గాలింపు చర్యలకు దౌత్యనిబంధనలు అడ్డంకి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ బంధువు తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-05-21T16:12:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising