ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: స్వదేశానికి వచ్చే ముందు.. స్నేహితుడిని కలిసి వస్తానని వెళ్లి కనిపించకుండా పోయిన భారత ట్యాక్సీ డ్రైవర్!

ABN, First Publish Date - 2023-03-12T09:29:38+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ఓ భారతీయ ట్యాక్సీ డ్రైవర్ (Indian Taxi Driver) కనిపించకుండా పోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (United Arab Emirates) ఓ భారతీయ ట్యాక్సీ డ్రైవర్ (Indian Taxi Driver) కనిపించకుండా పోయాడు. దాంతో అతడి బంధువులు కాన్సులేట్‌లో మిస్సింగ్ (Missing) కేసు నమోదు చేయించారు. ఇలా కనిపించకుండా పోయిన వ్యక్తి అజేష్ కురియా (41). అతడి స్వస్థలం కేరళ రాష్ట్రంలోని కన్నూర్ (Kannur). కాగా, అజేష్ గత కొన్నేళ్లుగా యూఏఈలో ట్యాక్సీ డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో స్వదేశానికి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దాంతో రాస్ అల్ ఖైమాలో ఉండే ఓ మిత్రుడిని కలిసి వస్తానని వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయినట్లు అతడి బంధువులు చెబుతున్నారు.

అయితే, ఫిబ్రవరి మొదటి వారం వరకు అతడు ఫోన్ ద్వారా బంధువులకు అందుబాటులోనే ఉన్నట్లు తెలిసింది. ఇక ఆ తర్వాతి నుంచి అజేష్ పత్తా లేకుండా పోయాడు. కానీ, కొంతమంది స్నేహితులు అజేష్‌ను చివరగా సోనాపూర్‌ (Sonapur) ఏరియాలో ఫిబ్రవరి 10వ తేదీన చూసినట్లు చెప్పారు. ఇప్పటివరకు అతడి ఆచూకీ లేదు. దాంతో బంధువులు, స్నేహితులు కలిసి కాన్సులేట్‌లో అజేష్ కనిపించకుండాపోయాడని ఫిర్యాదు చేశారు. ఎవరికైనా అతడి ఆచూకీ తెలిస్తే +971 55 903 6156 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: వామ్మో.. అసలు చైనాలో ఏం జరుగుతుంది..? ఈ వింత ఘటన ఏంటి..!?

Updated Date - 2023-03-12T09:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising