ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: సింగపూర్‌లో షాకింగ్ ఘటన.. కూతురి ఇంటికి వెళ్లిన భారతీయ మహిళను చంపేసిన పనిమనిషి.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-07-17T21:04:33+05:30

అయిదేళ్ల క్రితం సింగపూర్‌లో ఓ భారతీయ వృద్ధురాలిని చంపిన కేసులో మయాన్మార్ యువతికి సింగపూర్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. తొలుత యువతి వారింట్లో పనిమనిషిగా చేరింది. ఆ తరువాత వృద్ధురాలికి యువతి పని నచ్చక ఆమెను పంపించేస్తానని అని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన యువతి ఆమెను కత్తితో పొడిచి చంపేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అవును.. ఆమెను నేనే చంపేశా.. 26 సార్లు కత్తితో పొడిచా.. ఇదీ కోర్టులో ఓ హంతకురాలి వాంగ్మూలం. ఈ హత్య జరిగింది సింగపూర్‌లో కాగా నిందితురాలు హత్య చేసింది ఓ భారతీయ మహిళని.! తన కొడుకూ కోడలిని చూసేందుకు వెళ్లిన ఆమెను ఆ ఇంట్లో పని చేసే పనిమనిషే దారుణంగా హత్య చేసింది. 2018 నాటి ఈ ఘటన నిందితురాలికి తాజాగా యావజ్జీవ కారాగార శిక్ష పడింది(Life Sentence). పూర్తి వివరాల్లోకి వెళితే..

మయాన్మార్‌కు చెందిన జిన్ మార్ న్వే.. 2018 జనవరి 5న పోట్టకూటి కోసం సింగపూర్‌లో(Singapore) కాలుపెట్టింది. అప్పటికి ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు. కానీ సింగపూర్‌లో ఇళ్లల్లో సహాయకురాలిగా పనిచేసేందుకు ఉండాల్సిన కనీస వయసు 23. కానీ జిన్ మార్ మాత్రం తన పాస్‌పోర్టులో అసత్యాలు పేర్కొని సింగపూర్‌లో కాలు పెట్టింది. ఆ తరువాత నాలుగు నెలలకు ఓ భారతీయ కుటుంబంలో పనికి చేరింది. ఆ కుటుంబంలో భార్య, భర్త, వారి టీనేజ్ పిల్లలు ఉండేవారు. అంతకుమునుపు నాలుగేళ్ల పాటు వారింట్లో పనిచేసిన ఓ ఫిలిప్పీన్స్‌ మహిళ తన స్వదేశానికి వెళ్లిపోవడంతో వారు జిన్‌ను పనిలోపెట్టుకున్నారు.

ఆ భారతీయ కుటుంబంలో పనిచేయడంలో జిన్‌కు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. ఉదయం 5.30 గంటలకు లేచే ఆమె రాత్రి 11.00 వరకూ ఇంటి పని చేసేది. వారు ఆమెకు నెలకు 450 సింగపూర్ డాలర్లు ఇచ్చేవారు. ఆమె తన కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడేందుకూ వారు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని జిన్ స్వయంగా కోర్టుకు తెలిపింది.

జిన్ ఆ ఇంట్లో పనికి కుదిరిన రెండు వారాలకు కూతురూ అల్లుడిని చూసేందుకు ఓ వృద్ధురాలు (70) సింగపూర్‌కు వచ్చింది. కానీ, మొదటి నుంచీ వృద్ధురాలితో వ్యవహారం తనకు ఇబ్బందిగా మారిందని జిన్ కోర్టుకు నివేదించింది. వృద్ధురాలు చెప్పేది అర్ధం చేసుకోలేకపోయిన ప్రతిసారీ ఆమె తనను కొట్టేదని చెప్పింది. మొదట్లో మొట్టికాయలు మాత్రమే వేసిన ఆమె ఆ తరువాత అట్లకాడతో కొట్టడం ప్రారంభించిందని చెప్పుకొచ్చింది.

ఇక 2018 జూన్ 25న ఇంట్లో వృద్ధురాలు, పనిమనిషి జిన్ మాత్రమే ఉన్న సమయంలో పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. ఆ సమయంలో జిన్ ప్రమాదవశాత్తూ వృద్ధురాలి కాలిపై ఓ గిన్నె జారవిడిచింది. దీంతో ఆమె పనిమనిషికి ఓ హెచ్చరిక జారీ చేసింది. మరుసటి రోజున జిన్‌ను ఆమె ఏజెంట్ వద్దకు పంపించేస్తానని స్పష్టం చేసింది. అప్పటికే జిన్ ఇద్దరి వద్ద పనిమనిషిగా చేరి ఆ తరువాత మానేసింది. ఈమారూ తిరస్కరణకు గురైతే ఆమె స్వదేశానికి వెళ్లిపోవాల్సి వస్తుంది. దీంతో, ఆగ్రహానికి గురైన జిన్ కత్తి తీసుకుని వృద్ధురాలిని ఏకంగా 26 సార్లు పొడవడంతో ఆమె కుప్పకూలిపోయింది(Myanmar maid kills indian woman).

ఆ తరువాత జిన్ రక్తమోడున్న కత్తిని కడిగేసి అక్కడే పెట్టేసింది. అనంతరం, ఇంట్లో ఉన్న తన వస్తువులు, బ్యాగ్, కొంత నగదు, ఓ చెల్లింపుల కార్డును తీసుకుని బయటకు వచ్చేసింది. తన ఏజెన్సీ వద్ద ఉన్న పాస్‌పోర్టును తీసుకునేందుకు వెళ్లగా వారు భారతీయ కుటుంబానికి కాల్ చేయడం చూసి అక్కడి నుంచి బయటపడింది. కొన్ని గంటల పాటు నగరంలోనే అటూ ఇటూ తిరిగి మళ్లీ తన ఏజెన్సీ వద్దకే వెళ్లింది. ఈ మారు అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి జిన్‌ను అరెస్టు చేశారు. తొలుత తనకేమీ తెలీదని చెప్పిన ఆమె ఆ తరువాత ఏవో కట్టుకథలు వినిపించింది. చివరకు నేరం అంగీకరించింది.

Updated Date - 2023-07-17T21:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising