ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI Woman: ఆన్‌లైన్‌లో పరిచయమైన ఎన్నారై మహిళను.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడి నిర్వాకం

ABN, First Publish Date - 2023-01-26T09:19:59+05:30

ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ ఎన్నారై మహిళను (NRI Woman) పంజాబ్‌లోని మొగాకు చెందిన యువకుడు పెళ్లి (Marriage) పేరిట మోసం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగా: ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ ఎన్నారై మహిళను (NRI Woman) పంజాబ్‌లోని మొగాకు చెందిన యువకుడు పెళ్లి (Marriage) పేరిట మోసం చేశాడు. ఆమె నుంచి గడిచిన రెండేళ్లుగా భారీ మొత్తంలో నగదు, విలువైన గిప్టులు తీసుకున్నాడు. ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్నారై యువతి అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. దీంతో అతడి బండారం బయటపడింది. ఎన్నారై మహిళ ఫిర్యాదుతో అతడిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం మొగాకు చెందిన కుల్వీందర్ సింగ్‌కు (Kulwinder Singh) కాలిఫోర్నియాలో స్థిరపడ్డ అమృత్‌సర్‌లోని చౌక్ మెహతాకు చెందిన ఎన్నారై మహిళతో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా రెండేళ్ల క్రితం పరిచయడం ఏర్పడింది.

దాంతో వారిద్దరూ తరచూ సోషల్ మీడియాలో (Social Media) చాట్ చేసుకోవడం చేశారు. ఈ క్రమంలో తాను మంచి ట్రక్ డ్రైవర్ (Truck Driver) అని ఆమెతో చెప్పాడు. దాంతో ఆమె యూఎస్‌లో ట్రక్ డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉందని, ఇక్కడికి షిఫ్ట్ అయితే తాను సాయం చేస్తానని కుల్వీందర్‌తో చెప్పింది. ఆమె ప్రపోజల్‌ను ఓకే చెప్పిన అతడు.. అప్పటి నుంచి గత రెండేళ్లుగా ప్రతిరోజు మాట్లాడటం, చాట్ చేయడం చేశాడు. ఆ తర్వాత ఓ రోజు కుల్వీందర్ ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టాడు. దానికి ఆమె కూడా అంగీకరించింది. అలా రెండేళ్ల నుంచి వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉన్నారు. దాంతో ఆమె పలు దఫాల్లో కుల్వీందర్‌కు భారీ మొత్తంలో నగదు, గిఫ్టులు పంపించడం చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల అతడి గురించి ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకుంది.

ఆ తర్వాత కుల్వీందర్‌ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమె కాల్స్‌కు స్పందించ లేదు. దీంతో ఆమె హూటాహూటిన స్వదేశానికి వచ్చింది. అనంతరం కుల్వీందర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతడు చాలా కాలంగా దాటావేస్తూ వస్తున్నాడని పోలీసులకు తెలిపింది. అతడు కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఆర్థికంగా సహాయం చేశాను. ఇంటి సామాగ్రితో పాటు విలువైన గిఫ్ట్స్ కూడా పంపించాను. తీరా ఇప్పుడు మరో యువతిని పెళ్లాడేందుకు రెడీ అయ్యాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎన్నారై మహిళ ఫిర్యాదు మేరకు కుల్వీందర్‌పై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-26T09:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising