ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో అరుదైన ఘటన.. ప్రతి 50 కోట్ల మందిలో ఒక్కరే ఇలా..

ABN, First Publish Date - 2023-01-08T17:14:43+05:30

అమెరికాలో అరుదైన ఘటన వెలుగు చూసింది. హృదయాకారంలో గర్భసంచీ గల ఓ మహిళ ఏకంగా కవలలకు జన్మనిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: పురుడు పునర్జన్మతో సమానం అని అంటారు. అనేక సమస్యలను దాటుకుని బిడ్డల్ని కనడమంటే మరోసారి జన్మనెత్తినట్టే అని దీని అర్థం. అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక యుగంలోనూ గర్భిణులను కొన్ని అరుదైన సమస్యలు వెంటాడతాయి. అలాంటి పరిస్థితిని అధిగమించి మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది ఓ అమెరికా మహిళ. హృదయాకారంలో(Heart Shaped Uterus) గర్భసంచీ గల ఆమె ఏకంగా కవలలకు(Twins) జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ కవలల వయసు సుమారు ఏడాదిన్నర. హుషారుగా ఆడుకుంటున్న తమ పిల్లల్ని చూసి తల్లి కేరెన్, తండ్రి షాన్ మురుసిపోతున్నారు. ఇలాంటి గర్భసంచీ గల మహిళలు కవలలకు జన్మనివ్వడం చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్య ఉన్న 50 కోట్ల మందిలో ఒక్కరు మాత్రమే సురక్షితంగా బిడ్డను కనగలరు. కడుపుతో ఉన్నప్పటి పరిస్థితి గుర్తుకొచ్చినప్పుడల్లా కేరెన్ ఒళ్లు జలదరిస్తుంది.

2021లో కేరెన్ రెండో మారు గర్భం దాల్చింది. అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంది. అయితే.. కవలలు కడుపునపడ్డారని తెలిసి ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆ తరువాత మార్చిలో స్కానింగ్ తీసినప్పుడు ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆమె గర్భసంచీ హృదయాకారంలో ఉండటంతో ప్రసవం ప్రమాదకరంగా మారొచ్చని వైద్యులు హెచ్చరించారు. దీంతో..కేరెన్ తల్లడిల్లిపోయింది. తన బాగోగుల కంటే బిడ్డల పరిస్థితి ఏమౌతుందో అని కేరెన్ తెగ ఆందోళన చెందింది. మొదటిసారి ఆమె తల్లైనప్పుడు ఈ సమస్య బయటపడలేదు. స్కానింగ్‌ చేసేటప్పుడు ఒక్కోసారి ఇలాంటివి వైద్యుల దృష్టిని దాటిపోతుంటాయి. ఇక నెలలు గడుస్తున్నా అంతా సవ్యంగా సాగుతుండడంతో కేరెన్ కాస్తంత కుదుటపడసాగింది. అలాంటి టైం ఒక్కసారిగా ఆమె రక్తపోటు పడిపోవడంతో వైద్యులు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 31 ఆమె కవలలకు జన్మనిచ్చింది. బిడ్డల పరిస్థితి దృష్ట్యా వైద్యులు వారిని మరో నెలల రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించారు. బిడ్డలు లేకుండా ఉత్తచేతుల్తో ఇంటికి రావడం నేను భరించలేకపోయాను. గుండెను కత్తితో కోస్తున్నట్టుగా బాధకలిగేదని ఆమె మీడియాతో చెప్పుకొచ్చారు. అయితే..కవలల ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో నెల రోజుల తరువాత వారు తల్లి ఒడికి చేరుకున్నారు. ఆరోగ్యంగా ఎదుగుతున్న వారిద్దరినీ చూసి ప్రస్తుతం కేరెన్ తల్లిమనసులో ఆనందం వెల్లివిరుస్తోంది.

Updated Date - 2023-01-08T17:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising