ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: న్యూజిలాండ్‌కు వచ్చి తప్పు చేశాం.. భారతీయుల ఆవేదన..

ABN, First Publish Date - 2023-01-06T21:34:17+05:30

న్యూజిలాండ్‌లో పెరుగుతున్న దోపిడీలు, నేరాలు అక్కడి భారతీయ వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: న్యూజిలాండ్‌లో(New Zealand) పెరుగుతున్న దోపిడీలు, నేరాలు అక్కడి భారతీయ వ్యాపారులను(Indians) తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. న్యూజిలాండ్‌ తమకు ఇక ఎంతమాత్రం సురక్షితమైంది కాదంటూ భారతీయ షాపు ఓనర్లు(Retailers), వ్యాపారస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి తప్పు చేశామనిపిస్తోందని మరికొందరు బాధపడ్డారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఆక్లాండ్‌(Auckland), హామిల్టన్(Hamilton) ప్రాంతాల్లో ఇటీవల 24 గంటల వ్యవధిలో రిటైల్ షాపుల్లో పలు దోపిడీలు జరిగాయి. నిందితులు భారతీయులు నిర్వహించే షాపులనూ టార్గెట్ చేసుకున్నారు.

గురువారం తెల్లవారు జామున ఆక్‌ల్యాండ్‌లో జరిగిన దోపిడీలో నిందితులు ఖన్నా శర్మ గ్యాస్ స్టేషన్‌ను టార్గెట్ చేశారు. కారుతో షాపు తలుపులను ఢీకొట్టి చేతికందినవి దోచుకుపోయారు. దీంతో.. షాపు యజమాని శర్మ తీవ్రభయాందోళనకు గురయ్యారు. ఇలాంటి దోపిడీ జరగడం ఇది మూడోసారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అత్యంత సురక్షితమైన దేశాల్లో న్యూజిలాండ్‌ ఒకటని భావించాను. అది తప్పని అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చి తప్పు చేశాను’’ అంటూ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గత డిసెంబర్ చివర్లో మరో భారతీయుడు నిర్వహిస్తున్న షాపులో దొంగలు పడ్డారు. ఈ ఘటనలో బాధితుడు జయేశ్ పటేల్‌కు 10 వేల డాలర్ల నష్టం వాటిల్లింది. ‘‘షాపు తలుపులు బద్దలుకొట్టి 50 డాలర్ల విలువైన సిగరెట్లు, ఇతర వస్తువు దోచుకుపోయారు. పాడైన తలుపును రిపెయిర్ చేయించుకునేందుకు ఇప్పుడు 10 వేల డాలర్లు ఖర్చుపెట్టాలి’’ అంటూ జయేశ్ బాధపడ్డారు. ‘‘తమ చర్యలకు పర్యవసానాలు ఉండవన్న ధీమాతోనే నిందితులు నేరాలకు తెగబడుతున్నారు. ఈ విషయంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయి.’’ అని పటేల్ అన్నారు.

Updated Date - 2023-01-06T21:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising