NRI: ఇలాంటివారు చాలా అరుదు.. సొంతూరి కోసం ఎన్నారై ఏకంగా రూ.1.10కోట్ల వ్యయంతో.. కార్పొరేట్ స్థాయిలో..
ABN, First Publish Date - 2023-02-12T10:09:11+05:30
ఓ ఎన్నారై (NRI) తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నాడు. కోట్లు వెచ్చించి గ్రామ ముఖచిత్రాన్నే మార్చేశాడు.
ఎన్నారై డెస్క్: ఓ ఎన్నారై (NRI) తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్నాడు. కోట్లు వెచ్చించి గ్రామ ముఖచిత్రాన్నే మార్చేశాడు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ విలేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశాడు. దానికోసం ఏకంగా రూ.1.10కోట్ల తన సొంత డబ్బు ఖర్చు చేశాడు. తాను విదేశాల్లో సంపాదించిన దాంట్లో ఇలా కొంత బాగాన్ని పుట్టిన గడ్డ బాగు కోసం వెచ్చిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం (Rajasthan) బార్మర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం బుద్ధ తలా (Budha Tala). ఈ ఊరి బిడ్డే నవల్ కిశోర్ గోదారా (Naval Kishore Godara). ఆఫ్రికాలోని కాంగోలో (Congo) స్థిరపడ్డాడు. అక్కడ పెద్ద వ్యాపారవేత్త. ఇప్పటివరకు బాగానే సంపాదించాడు.
కానీ, కిశోర్‌కు చిన్నప్పటి నుంచి పుట్టిన ఊరి కోసం తనవంతు సాయంగా ఏదైనా చేయాలనే కోరిక బలంగా ఉండేది. అదే ఇప్పుడు బుద్ధ తలా ముఖచిత్రాన్ని మార్చేసింది. ఏకంగా రూ.1.10కోట్ల సొంత డబ్బుతో ఆ ఊరిలో కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పనులు చేయించాడు. ఇక ఆ ఊరి గ్రామ పంచాయితీ భవనం (Gram Panchayat Building) చూస్తే మతిపోవాల్సిందే. కార్పొరేట్ ఆఫీస్‌ను (Corporate Office) ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. అందులో సౌకర్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎల్లప్పుడు భవనం ముందు ఓ వాహనం, ముగ్గురు సిబ్బంది ఉంటారు. వారికి ప్రతినెల తన సొంత డబ్బులతో జీతాలు ఇస్తున్నాడు. ఆ ముగ్గురు సిబ్బంది చేయాల్సింది ఆ ఊరి ప్రజలకు ఏ సమస్య ఉన్న చూసుకోవడం. వాటిని కిశోర్ దృష్టికి తీసుకెళ్లడం.
ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..
ఇక వాహనాన్ని ఊరి ప్రజలు అత్యావసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ ఊరికి సర్పంచ్ ఎవరో తెలుసా? కిశోర్ తల్లి నోజి దేవీ (80). దాంతో ఆయనే ఆ ఊరికి ఏం కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. రోడ్లు, త్రాగునీరు, ఇతర సౌకర్యాలు ఇలా అన్ని కిశోర్ తన సొంత ఖర్చులతో చేయిస్తున్నాడు. దీంతో ఊరిపై తన కుమారుడు చూపిస్తున్న ప్రేమ పట్ల నోజి దేవీ మురిసిపోతుంది. ఊరి ప్రజలు కూడా కిశోర్ చేస్తున్న అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన గడ్డ కోసం ఇంతలా పరితపించేవారు చాలా అరుదుగా ఉంటారని చెబుతున్నారు.
Updated Date - 2023-02-12T10:11:38+05:30 IST