ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: చేయకూడని పొరపాటు చేసిన ఎన్నారై జంట.. చివరికి భారీ మూల్యం..

ABN, First Publish Date - 2023-01-03T19:16:25+05:30

ఆన్‌లైన్ స్నేహం కారణంగా ఓ ఎన్నారై జంట భారీ మూల్యం చెల్లించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ పరిచయాలు, స్నేహాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. పైమెరుగులు, కల్లబొల్లి మాటలను(Online Fraud) నమ్మితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. కేరళకు చెందిన ఓ ఎన్నారై జంట(NRI Couple) సరిగ్గా ఇలాంటి పొరపాటు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ దంపతులు ఏకంగా 20 లక్షల మేర నష్టపోయారు.

కేరళకు(Kerala) చెందిన ఓ ఎన్నారై విదేశాల్లో నివసిస్తుంటారు. కొద్ది కాలం క్రితం ఆయనకు ఫేస్‌బుక్‌లో(Facebook) ఓ వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరూ తరచూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో చాట్ చేసేవారు. తానూ విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటానని ఫేస్‌బుక్ ఫ్రెండ్ ఎన్నారైకి చెప్పాడు. త్వరలో ఇండియాకొచ్చి ఎన్నారై దంపతులిద్దరినీ కలుస్తానని అన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ మొదటి వారంలో అతడు ఎన్నారై దంపతులను సంప్రదించాడు. తాను ఇండియాకు వచ్చానని, కానీ ఎయిర్‌పోర్టులో తన లగేజీని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారని చెప్పుకొచ్చాడు. రూ.3 కోట్ల విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి అధికారుల వద్ద ఉన్న సూట్‌కేసులో ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. లగేజీని వెనక్కు తెచ్చుకునేందుకు కొంత ఖర్చువుతుందని చెప్పిన అతడు ఆ మేరకు డబ్బు సర్దాలంటూ ఎన్నారైని అభ్యర్థించాడు. లగేజీ తనకు దక్కగానే డబ్బు మొత్తం ఇచ్చేస్తానంటూ మాటిచ్చాడు. దీంతో.. ఆ ఎన్నారై మరో ఆలోచన లేకుండా తన వద్ద ఉన్న డబ్బుతో పాటూ స్నేహితుల, బంధువుల నుంచి మరికొంత సేకరించారు. చివరకు రూ.20 లక్షలకు పైగా మొత్తాన్ని విడతల వారీగా అతడికి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తరువాత అతడికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో తాను మోసపోయానన్న విషయం ఆ ఎన్నారైకి అర్థమైంది. దీంతో.. ఎన్నారై భార్య ఇటీవల ఎర్నాకుళం(Ernakulam) సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-01-03T19:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising