ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman: వందకు పైగా దేశాల టూరిస్టులకు ఒమాన్ బంపరాఫర్.. కానీ, భారతీయులకు మాత్రం కండిషన్స్ అప్లై..!

ABN, First Publish Date - 2023-03-15T10:14:26+05:30

గల్ఫ్ దేశం ఒమాన్ (Oman) వందకు పైగా దేశాల టూరిస్టులకు బంపరాఫర్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్ (Oman) వందకు పైగా దేశాల టూరిస్టులకు బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా 103 దేశాల సందర్శకులకు 14 రోజుల వ్యవధితో కూడిన వీసా ఫ్రీ ఎంట్రీకి (Visa-free Entry ) అవకాశం కల్పించింది. రాయల్ ఒమాన్ పోలీస్ (Royal Oman Police) ప్రకారం.. పోర్చుగల్, స్వీడన్, నార్వే, ఇటలీ, బల్గేరియా, స్విట్జర్లాండ్, క్రోయేషియా, హంగేరీ, సెర్బియా, జార్జీయా, డెన్మార్క్, జర్మనీ, గ్రీస్, ఐస్‌ల్యాండ్, బెల్జీయం, రొమేనియా, స్లోవేనియా, ఫిన్లాండ్, లగ్జెంబర్గ్, మాల్టా, మొనాకో, సైప్రస్, ఉక్రెయిన్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, పోలాండ్, స్లోవేకియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, వెనెజులా, కొలంబియా, ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా, బ్రెజిల్, జపాన్, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా, రష్యా, చైనా, అమెరికా, టర్కీయే, సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఇరాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, తైవాన్, కెనడా, మలేసియా, సింగపూర్ టూరిస్టులకు ఈ వీసా ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఉంది.

ఇక ఈ దేశాల నుంచి వచ్చే సందర్శకులకు (Tourists) మరో వెసులుబాటు కూడా ఉంది. తమ వీసా ఫ్రీ స్టేను (Visa-free Stay) అదనంగా మరికొంత ఫీజు చెల్లించి 14 రోజుల వరకు పొడిగించుకోవచ్చు. అయితే, ఆయా దేశాల టూరిస్టులు ముందుగానే ఈ-వీసా (e-Visa) కోసం 20 ఒమానీ రియాళ్లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న సందర్శకులకు ఒక నెల వాలిడిటీతో వీసా ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే ఈ 103 దేశాలకు చెందిన పౌరులు ఏడాది వ్యవధితో మల్టీ-ఎంట్రీకి (Multi Entry) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, మల్టీ-ఎంట్రీపై ఒమాన్‌కు వచ్చేవారు నెల రోజులకు మించి ఆ దేశంలో బస చేయడానికి వీలు ఉండదు. దీంతో పాటు ఇతర కొన్ని షరతులు కూడా ఉంటాయని ఒమాన్ పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ప్రవాసులకు మరో ఝలక్.. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో భారీగా వర్క్ పర్మిట్ల కోత..!

ఇకపోతే భారతీయులకు (Indians) మాత్రం షరతులతో కూడిన వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సౌకర్యం కల్పించింది. యూఎస్, కెనడా, యూకే, షెంజెన్ దేశాలు, జపాన్‌ (లేదా) గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (Gulf Cooperation Council) దేశాల రెసిడెంట్ పర్మిట్ కలిగిన భారతీయ టూరిస్టులకు ఈ సౌకర్యం ఉంటుంది. సో.. భారతీయులకు నేరుగా ఈ సౌకర్యం కల్పించకుండా కండిషన్స్ అప్లై అంటోందన్నమాట.

ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. నెల క్రితం వేకేషన్స్ కోసం స్వదేశానికి వచ్చిన భారతీయ నర్సు.. ఇంతలోనే తీవ్ర విషాదం..!

Updated Date - 2023-03-15T10:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising