Oman లో అనూహ్య పరిణామం.. ఇంతకుముందెన్నడూ లేని విధంగా 82శాతం పెరిగిన ఆదాయం
ABN, First Publish Date - 2023-02-12T13:27:47+05:30
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటోంది.
మస్కట్: కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటోంది. విదేశీ పర్యాటకుల (Foreign Tourists) రాకపోకలు ఊపందుకోవడంతో హోటళ్లు (Hotels), రెస్టారెంట్స్ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. గల్ఫ్ దేశం ఒమన్‌లో (Oman) కూడా ఈ సానుకూలతతోనే ఇంతకుముందెన్నడూ లేని విధంగా హోటళ్ల ఆదాయం భారీగా పెరిగినట్లు తాజాగా నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ గణాంకాలు వెల్లడించాయి. 3, 5స్టార్ హోటళ్ల రెవెన్యూ గతేడాది డిసెంబర్ నాటికి ఏకంగా 82.7శాతం మేర పెరిగిందని నివేదిక తెలిపింది. అలాగే అంతకుముందు ఏడాదితో పోలిస్తే హోటళ్లలో అతిథుల సంఖ్య 33.6 శాతం పెరిగింది.
ఇదే సమయంలో గల్ఫ్ గెస్టుల సంఖ్య 304 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 2021 చివరి నాటికి 39,689 మంది నుంచి 2022 డిసెంబర్ చివరి వరకు 160340కి చేరుకుంది. యూరోపియన్ పర్యాటకుల సంఖ్య డిసెంబర్ 2021 చివరి నాటికి 1,05,558 నుంచి 3,60,339కి పెరిగింది. డిసెంబర్ 2022 చివరి వరకు 241.4శాతం వృద్ధి రేటు నమోదైంది. అమెరికన్ టూరిస్టుల సంఖ్య విషయానికి వస్తే ఇది డిసెంబర్ 2022 చివరి వరకు 60,148 మందికి చేరింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 165.4శాతం పెరుగుదలను నమోదు చేసింది. అయితే ఒమానీల సంఖ్య 14.1 శాతం తగ్గింది. డిసెంబర్ 2021 నాటికి వీరి సంఖ్య 814518 ఉండగా, డిసెంబర్ 2022కు 6,99,937కి పడిపోయింది.
ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో.
Updated Date - 2023-02-12T13:28:24+05:30 IST