ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TAGC: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో వారి మహిళా దినోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2023-03-26T11:01:57+05:30

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC - ఉత్తర అమెరికాలోనే మొట్టమొదటి తెలుగు సంఘం), అమెరికన్ తెలంగాణ సంఘం (ATS) సహకారంతో 2023 మార్చి 5న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) విజయవంతముగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చికాగో: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (TAGC - ఉత్తర అమెరికాలోనే మొట్టమొదటి తెలుగు సంఘం), అమెరికన్ తెలంగాణ సంఘం (ATS) సహకారంతో 2023 మార్చి 5న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) విజయవంతముగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చికాగోలోని ఓలివ్ ప్యాలేస్ బంక్వేట్స్‌లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి చికాగో మహా నగర నలుమూలల నుండి 500 మందిపైగా మహిళలు “Be the heroine of your life” అనే థీమ్‌తో జరుపుకున్నారు. మహిళలు అందరూ Sequin and Ruffle Saree wear ధరించి అందమైన వస్త్రధారణతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

శ్రుతి ఠాకూర్ ప్రార్ధన గీతములతో కార్యక్రమము ప్రారంభమైంది. అధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి యరసాని, అరుణ శ్రీ యరసాని, సహా హోస్ట్ ఎటిఎస్ ప్రెసిడెంట్ నరేంద్ర చేమర్ల, రాజలక్ష్మి చేమర్ల, జ్యోతి మాధవరం, ఉమెన్స్ డే చైర్ మాధవి రాణి కొనకళ్ళ, కో-చైర్ నీలిమ బొడ్డు, రచన కొలుగూరి, వాణి రాచకొండ, టీఏజీసీ (TAGC) మహిళా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఉమా అవధూత, వినీత పొద్దుటూరి, అర్చన పొద్దుటూరి, నీలిమ చైకిచెర్ల, శిరీష మద్దూరి, ప్రసన్న కందుకూరి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అతిథిగా విద్య నహర్ మహిళల కోసం యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఇతర స్పీకర్లు సత్య రంగరాజు, శుభప్రియ లక్ష్మణన్ కూడా women empowerment గురించి పస్ర్తావించారు. ఈ కార్యక్రమంలో చికాగో ప్రాంతంలోని Chicago Area Telugu Seniors (CATS) నుండి విచ్చేసిన పెద్దలను ఆదరించి సత్కరించారు. ఈవిధమైన సత్కారమునకు మిక్కిలి సంతోషించి అధ్యక్షుడు శ్రీ పరమేశ్వర రెడ్డియరసాని, women’s day chair మాధవి రాణికొనకళ్ళ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమములో పాల్గొన్నవారికిఫ్యాషన్ వాక్, రీల్స్, షార్ట్స్ పోటీలు, కాహూట్ గేమ్స్, ఇతర ఆహ్లాదకరమైన పోటీలను నిర్వహించి ఉత్తేజ పరిచారు. రాత్రి స్నాక్స్, డిన్నర్ టీఎజీసీ ఫుడ్ టీమ్ శ్రీనివాస్ రెడ్డికొల్లి, రోహిత్ అకుల, ఇతర టీఎజీసీబోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సృజన్ నయనప్పగారి, శశి చావ, రమణ కల్వ, శ్రీనివాస్ రెడ్డి నాగిరెడ్డి, లక్ష్మీ నారాయణ తోటకూర కూడా సహకరించారు.

యాంకర్ సమీర ఇల్లెందుల అందరికీ తన ఫన్ లైన్లతో, చమత్కార పశ్ర్నలతో అద్భుతమైన జోష్‌ను అందించారు. ఈ కార్యక్రమములో స్వదేశంలో సేవా కార్యక్రమాలు అందిస్తున్న నాన్-ప్రాఫిట్ సంస్థలు విరాళాలు సేకరించి అందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధప్రద్రేశ్‌లోని సుగుణ ఫౌండేషన్ (Suguna Foundation), హైదరాబాద్‌లోని అక్షయ ఫౌండేషన్ (Akshaya Foundation) కు చందాలను వసూలు చేసిసమర్పించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో టీఏజీసీ (TAGC) ఎల్లపుడూ ముందంజలో ఉంటుందని అభినందించారు.

చికాగోలో దివాన్ స్ట్రీట్‌లోని రీగల్ జ్యువెలర్స్ వారు రాఫెల్ టికెట్లకోసం స్వర్ణం, వెండి నాణాలను స్పాన్సర్ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి మహిళకు పీఎం కంసల్టింగ్ అధినేత కల్యాణి జొన్నవిత్తుల రిటర్న్ గిఫ్ట్స్ స్పాన్సర్ చేశారు. టీఏజీసీటీమ్ వారు యూత్ వాలంటీర్ల సహకారాలను అభినందించి సత్కరించడం జరిగింది. టీఏజీసీప్రెసిడెంట్ పరమేశ్వర రెడ్డి యరసాని, ఉమెన్స్ డే (Women’s Day ) చైర్ మాధవి రాణి కొనకళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈవెంట్ నిర్వహించడానికి సహకారం అందించిన స్పాన్సర్లకు, బోర్డు సభ్యులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తేలియజేశారు.

Updated Date - 2023-03-26T11:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising