ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telugu Expat: బతుకుదెరువు కోసం ఎడారిబాట.. చేయని నేరానికి ఉరిశిక్ష.. 17ఏళ్ల తర్వాత స్వగ్రామానికి..

ABN, First Publish Date - 2023-02-11T10:48:27+05:30

బతుకుదెరువు కోసం ఎడారిబాట పట్టిన బతుకు జీవి 14ఏళ్ల పాటు యూఏఈలో జైలు పాలయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈలో 14ఏళ్ల జైలుశిక్ష

హతుని కుటుంబ సభ్యుల క్షమాభిక్ష

నిజామాబాద్‌ జిల్లాకు చేరుకున్న బాధితుడు శంకర్‌

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 10: బతుకుదెరువు కోసం ఎడారిబాట పట్టిన బతుకు జీవి 14ఏళ్ల పాటు యూఏఈలో జైలు పాలయ్యాడు. చేయని తప్పునకు జైలుశిక్ష అనుభవించాడు. ఎడారి దేశంలో 14ఏళ్లపాటు నరకయాతన అనుభవించిన జిల్లాకు చెందిన మాకూరి శంకర్‌ సొంతగూటికి చేరుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండల కేంద్రానికి చెందిన మాకూరి శంకర్‌ 2004లో ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిలో చేరాడు. నాలుగేళ్లపాటు బాగానే పనిచేశాడు. అయితే అక్కడ పనిచేసే రాజస్థాన్‌లోని జాను జిల్లా తన్వర్‌ గ్రామానికి చెందిన రామవతార్‌ కుమావత్‌ అనే వ్యక్తి బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోవడంతో ఆ నేరాన్ని సూపర్‌వైజర్‌గా ఉన్న శంకర్‌మీద కంపెనీ యాజమాన్యం నెట్టివేసింది. దీంతో దుబాయి పోలీసులు శంకర్‌ను జైలులో వేశారు. 2009 నుంచి యూఏఈలోని పుదీరా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

శంకర్‌కు 2013లో ఉరిశిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు జిల్లాలోని టీడీపీకి చెందిన దేగాం యాదాగౌడ్‌ ను కలిసి తమగోడును వెళ్లబోసుకున్నారు. దీంతో దేగాం యాదాగౌడ్‌ దుబాయి అడ్వకేట్‌ వైజాక్‌కు చెందిన అనురాధతో కలిసి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉరిశిక్షను వాయిదా వేస్తూ వచ్చారు. రాజస్థాన్‌కు చెందిన రామవతార్‌ కుమావత్‌ కుటుంబ సభ్యుల క్షమాభిక్ష కాగితాల మీద సంతకాలు చేస్తే తప్ప శంకర్‌కు ఉరిశిక్ష తప్పదని తెలుసుకున్న దేగాం యాదాగౌడ్‌.. పలుమార్లు రాజస్థాన్‌ వెళ్లి వారిని కలిసి క్షమాభిక్షపై కుటుంబ సభ్యులను బతిమాలాడు. దీంతో హతుని కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు ఇవ్వాలన్న ఒప్పందంతో పలువురి సమక్షంలో క్షమాభిక్షకు సంతకాలు చేశారు. వీటిని దుబాయి కోర్టులో సమర్పించి మరణశిక్షను రద్దు చేయించారు. దీంతో శంకర్‌ మూడు రోజుల క్రితం జైలు శిక్షనుంచి విడుదలై ముంబాయి ద్వారా నిజామాబాద్‌ చేరుకున్నాడు. నిజామాబాద్‌కు చేరుకున్న శంకర్‌ కుటుంబ సభ్యులను, దేగాం యాదాగౌడ్‌ను చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. దుబాయి వెళ్లేటప్పుడు భార్య గర్భంతో ఉండగా ఇప్పుడు ఎదిగిన కొడుకును చూసి సంతోషం వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: దుబాయిలో ఓ భారతీయ ఫ్యామిలీ కొన్న.. ఈ విలాసవంతమైన విల్లా ఖరీదు తెలిస్తే..

ప్రాణాలతో తిరిగి వస్తాననుకోలేదు: మాకూరి శంకర్‌, మెండోర

జైలులో అనేక కష్టాలను అనుభవించాను. తిరిగి ప్రాణాలతో ఇంటికి వస్తానని అనుకోలేదు. చేయని తప్పుకు 14 ఏళ్లపాటు జైలు శిక్షను అనుభవించాను. స్వదేశానికి తిరిగి రావడానికి కృషిచేసిన దేగాం యాదగౌడ్‌, న్యాయవాది అనురాధల మేలు జన్మలో మరిచిపోలేను. తాను ఇండియా రావడానికి కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు.

సంతోషంగా ఉంది: భూదేవి, శంకర్‌ భార్య

ప్రాణాలతో తన భర్తను చూస్తానని అనుకోలేదు. తన రాకకోసం ఏళ్లపాటు ఎదురుచూసాం. అనేక ప్రయత్నాలు చేశాం. దేగాం యాదాగౌడ్‌ తదితరుల చొరవతో నా భర్త ఇంటికి రావడం సంతోషంగా ఉంది.

శ్రమ ఫలించింది: దేగాం యాదాగౌడ్‌

శంకర్‌ జైలు శిక్ష విధించినప్పటి నుంచి అతన్ని రప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశాను. అక్కడి లాయర్‌ అనురాధ సహకారంతో ఇక్కడి దాతల సహకారంతో డబ్బులను సమకూర్చి మృతుని కుటుంబ సభ్యులకు అందజేసాం. నాలుగు సార్లు రాజస్థాన్‌ స్వయంగా వెళ్లి మృతుని కుటుంబ సభ్యుల కాళ్లవేళ్ల పడి క్షమాభిక్షకు ఒప్పించాం. శంకర్‌ స్వదేశానికి రప్పించడం సంతోషంగా ఉంది.

ఇది కూడా చదవండి: అమెరికా సరికొత్త ఆలోచన.. వేలాది మంది భారతీయులకు పెద్ద ఊరట!

Updated Date - 2023-02-11T10:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising