ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: టెక్ రంగంలో తొలగింపులు.. అమెరికాలో ఎన్నారైలకు పెను సవాళ్లు..

ABN, First Publish Date - 2023-01-23T21:03:09+05:30

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి బడా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో ఎన్నారైలే అధికంగా ఇబ్బందుల్లో పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో వలసేతర వీసాలపై ఉద్యోగాలు చేసుకుంటున్న వేల మంది టెకీలను ఒక్కసారిగా సమస్యల చుట్టుముట్టాయి. గూగుల్(Google), మైక్రోసాఫ్ట్(Microsoft), అమెజాన్(Amazon) వంటి బడా సంస్థలు చేపట్టిన ఉద్యోగుల తొలగింపుల(Layoffs) ఫలితంగా ఎన్నారైలు(NRIs) పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. హెచ్-1బీ, ఎల్-1వీ వీసాలతో(Non Immigrant) అమెరికాలో ఉపాధి పొందుతున్న ఎన్నారైలు..ఉద్యోగం కోల్పోయాక నెలల వ్యవధిలో మరో జాబ్‌లో చేరాలి. వీసా నిబంధనల ప్రకారం..60 రోజుల లోపు కొత్త జాబ్ లభించని పక్షంలో వారు దేశాన్ని వీడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకూ దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఎన్నారైలు 30 నుంచి 40 శాతం వరకూ ఉంటారని అంచనా. ఎన్నారైల్లో అధిక శాతం మంది హెచ్-1బీ, ఎల్-1 లాంటి వలసేతర వీసాలతో(Non Immigrant Visas) అగ్రరాజ్యంలో ఉపాధి పొందుతున్నారు.

మరోవైపు.. ప్రధాన టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ బాట పట్టడంతో కొత్తగా జాబ్ దొరకడం కష్టంగా మారింది. ఇటీవలే అమెరికాలో కాలుపెట్టిన వారు, కుటుంబ బాధ్యతలు ఉన్న పలువురు ఎన్నారైలు అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. అయితే.. ఉద్యోగం పోతే ఇబ్బందుల్లో పడే ఎన్నారైల కోసం కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇవ్వాలని అక్కడి భారతీయ వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు.. జాబ్ కోల్పోయిన టెకీలు వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. కొత్త ఉద్యోగావకాశాల సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ సమస్యల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-01-23T21:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising