ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: క్రిస్మస్ సందర్భంగా కాలిఫోర్నియాలో WETA ఆధ్వర్యంలో టాయ్స్, బ్లాంక్సెట్స్ పంపిణీ

ABN, Publish Date - Dec 27 , 2023 | 06:43 PM

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో టాయ్స్ మరియు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు.

ఎన్నారై డెస్క్: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాల్లో విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) ఆధ్వర్యంలో టాయ్స్ మరియు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. కాలిఫోర్నియాలో శాక్రమెంటోలోని షెల్టర్ హోంలో ఉన్న స్త్రీలు, పిల్లలకు ఈ బొమ్మలు, బ్లాంక్సెట్స్‌ను అందజేశారు. అలాగే టెక్సాస్ స్టేట్‌లోని డల్లాస్ నగరంలో గుడ్ Samaritan షెల్టర్ హోంలో కూడా బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా WETA ఫౌండర్ ప్రెసిడెంట్ ఝాన్సీ, ప్రెసిడెంట్ శైలజ కల్లూరి మాట్లాడుతూ.. క్రిస్మస్ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో షెల్టర్ హోమ్స్‌లో ఉన్న స్త్రీలు, పిల్లలకు దుస్తులు, బొమ్మలు అందిస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా పిల్లల ముఖాల్లో సంతోషం, ఆనందం చూడడం సంతృప్తికరంగా ఉందని వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో WETA టీం సభ్యులు రత్నమాల, విశ్వ , పూజ , రేఖ, హైమ , అనురాధ , జ్యోతి, చందన సుధా, సునీత పాల్గొన్నారు. అదేవిధంగా డల్లాస్ నగరంలో జరిగిన కార్యక్రమంలో WETA టీం సభ్యులు స్మృతి, ప్రతిమ, ప్రశాంతి మరియు చిన్నారులు సుదీప, సంహిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 06:47 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising