UAE: యూఏఈ వెళ్లేవారు.. అప్‌డేట్ చేసిన 15 వీసా సంబంధిత సర్వీసుల గురించి తెలుకోవడం తప్పనిసరి..!
ABN, First Publish Date - 2023-02-16T08:28:27+05:30
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లేవారు తాజాగా ఆ దేశ ప్రభుత్వం అప్‌డేట్ చేసిన 15 వీసా సంబంధిత సర్వీసుల గురించి తెలుకోవడం తప్పనిసరి.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వెళ్లేవారు తాజాగా ఆ దేశ ప్రభుత్వం అప్‌డేట్ చేసిన 15 వీసా సంబంధిత సర్వీసుల గురించి తెలుకోవడం తప్పనిసరి. లేనిపక్షంలో అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో.. ముందుగానే అప్‌డేటేడ్ సర్వీసుల తెలుకోవడం బెటర్. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP) బుధవారం తన స్మార్ట్ ఛానెల్స్ ద్వారా అందుబాటులో ఉన్న వీసా, ఎంట్రీ పర్మిట్‌లకు సంబంధించిన 15 అప్‌డేటేడ్ సర్వీసులను ప్రకటించింది.
అవేంటంటే..
* 60, 180 రోజుల వ్యవధితో సింగిల్, మల్టీ ఎంట్రీల కోసం పర్యాటకం, చికిత్స, రోగి సహచరుల కోసం గ్రూప్ ఫ్యామిలీ వీసా జారీ.
* పాస్‌పోర్ట్‌ల జారీ, రెన్యువల్ కోసం దరఖాస్తులను సమర్పించేటప్పుడు వేలిముద్ర అవసరం లేకుండా దేశ పౌరులకు మినహాయింపు.
* 90 రోజుల వ్యవధితో కూడిన వీసాలను కలిగి ఉన్నవారికి ఒక సారి 30 రోజుల పాటు వీసా పొడిగింపును అనుమతించడం. ఒకవేళ దాని చెల్లుబాటు 6 నెలల కంటే ఎక్కువ ఉంటే రెసిడెన్సీ వీసా పునరుద్ధరణను నిషేధించడం.
* ఎమిరేట్స్ ఐడీ (ID) లేకుండా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) పౌరుల ఖాతాలలో వీసా డేటాను రద్దు చేయడం, సవరించడం కోసం ప్రత్యేక సేవలను అందించడం.
* వ్యక్తిగత ఖాతాలలో 30, 60, 90 రోజుల వ్యవధిలో ఒకే లేదా బహుళ ఎంట్రీల కోసం బంధువు లేదా స్నేహితుడి పర్యాటక వీసా పొడిగింపును అనుమతించడం.
ఇది కూడా చదవండి: ఎన్నారైలకు ప్రయోజనం కలిగేలా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భారత చిన్నారులకు..
ఐసీపీ (ICP) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. స్మార్ట్ సర్వీస్ సిస్టమ్‌లో అథారిటీ ఆమోదించిన అప్‌డేట్‌లు 2023 ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిలో భాగంగా పౌరులు, నివాసితులు, సందర్శకులు సహా అన్ని వర్గాల కస్టమర్‌లకు ఈ సర్వీసులను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తూ వారి అవసరాలను తీర్చడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక్కడివారిని వారి బంధువులు, పేరెంట్స్, స్నేహితులతో మళ్లీ కలపడం, వినియోగదారులకు సౌలభ్యాన్ని పెంచడమే అప్‌డేట్ చేసిన వీసా, ఎంట్రీ పర్మిట్ల ముఖ్య ఉద్దేశమని అన్నారు.
Updated Date - 2023-02-16T09:34:40+05:30 IST