ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బే ఏరియాలో ‘వీర సింహా రెడ్డి’ ఫీవర్...ఫ్యాన్స్ హంగామా!!

ABN, First Publish Date - 2023-01-13T16:04:55+05:30

‘వీర సింహారెడ్డి’ సినిమా ఫివర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌నూ(Overseas) తాకింది. బాలయ్య తన నట విశ్వరూపం చూపించి డబుల్ రోల్‌లో అదరగొట్టడంతో ఫ్యాన్స్‌కు థియేటర్‌లో పూనకాలు వస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్ కోట అండ్ ఫ్రెండ్స్‌ హంగామా.. CineMax 4K (a.k.a Serra)కు కొత్త హంగులు

మాస్ కా బాప్, గాడ్ ఆఫ్ మాస్, నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna Nandamuri), మెగా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల(Gopichand Malineni) కాంబోలో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’(Veera Simha Reddy) చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత బాలయ్య బాబు ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటించడంతో సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్‌ల తరహాలో ఈ చిత్రం కూడా బంపర్ హిట్ కొట్టిందని  బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఫివర్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌నూ(Overseas) తాకింది.

అమెరికాలోని బే ఏరియాలో(Bay Area) వీర సింహా రెడ్డి ఫీవర్ వేరే లెవల్‌లో ఉంది. బాలయ్య ఫొటోస్‌కు కొబ్బరికాయలు కొట్టి, బాలయ్య కటౌట్‌కు పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేశారు. బాలయ్య తన నట విశ్వరూపం చూపించి డబుల్ రోల్‌లో అదరగొట్టడంతో ఫ్యాన్స్‌కు థియేటర్‌లో పూనకాలు వస్తున్నాయి. అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై నేత, జయరాం కోమటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను వీక్షించి ఆనందించారు.

బాలయ్య అభిమానులు కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, మోహన్ సుగ్గల, శ్రీకాంత్ దొడ్డపనేని, లక్ష్మణ్ పరుచూరి, గంగా కోమటి, మధు కండేపి, సతీష్ బొల్లా, ప్రకాష్, సత్యనారాయణ తిపిర్నేని, మురళి గొడవర్తి, రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోగంటి, సుబ్బారావు తలచిరు, వెంకట్ సాధినేని, అమర్ అనుగంటి, అనిల్ కుమార్ యడ్లపల్లి, బద్రి బైండ్ల, చంద్ర గుంటుపల్లి, కళ్యాణ్ పళ్ళ, వీర బాబు, శ్రీధర్ చావా, సుందీప్, బెజవాడ శ్రీను, లియోన్, భరత్ ముప్పిరాళ్ల ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. CineMax 4K (a.k.a Serra) మేనేజింగ్ పార్టనర్ మోహన్ సుగ్గల మాట్లాడుతూ, శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జ‌న‌ర‌ల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్, అమెరికాలో ప్రముఖ ప్రవాసాంధ్రుడు, టీడీపీ ఎన్నారై నేత, జయరాం కోమటి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి, బాలయ్య అభిమానులకు పేరు పేరునా అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2023-01-13T16:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising