ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ajay: డబ్బులన్నీ అయిపోవడంతో.. రెస్టారెంట్‌లో పనిచేశా.. (OHRK Promo)

ABN, First Publish Date - 2023-01-07T14:48:01+05:30

అజయ్ (Ajay).. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి.. నటుడిగా తిరుగులేని గుర్తింపును

Actor Ajay Open Heart With RK
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అజయ్ (Ajay).. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి.. నటుడిగా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకున్నారు అజయ్. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ (Vikramarkudu) చిత్రంలో టిట్లా పాత్రలో భయంకరంగా కనిపించాడు అజయ్. ఆ పాత్రే తనకు ప్లస్సూ, మైనస్సూ అని ఆయన అంటున్నారు. తాజాగా ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart with RK) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో.. (Open Heart with RK Promo)

‘‘ * ‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత ఇంట్లో పిల్లలు నా దగ్గరకు రాలేదు. టిట్లా అనుకుని భయపడిపోయారు. ఆ సినిమా వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ నన్ను ‘విక్రమార్కుడు’ టిట్లా అనే అంటారు.

* మొనాటనీ అనిపిస్తున్న టైమ్‌లో.. మంచి పాత్రలు వస్తాయనే హోప్‌తో ఉన్నప్పుడే ‘విక్రమార్కుడు’, ‘ఇష్క్’ (Ishq), ‘దిక్కులు చూడకు రామయ్యా’ (Dikkulu Choodaku Ramayya) వంటి సినిమాలలో పాత్రలు వచ్చాయి.

* నాకు హైట్ బాగా కలిసి వచ్చింది. అసలు పొడుగు ఉన్నాననే ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకంటే హైట్ ఉన్న హీరోలే రావాలని ప్రార్థనలు చేసేవాడిని. ఇప్పుడు హీరోలే విలన్లుగా చేసేస్తున్నారు.

* మధ్యలో నేపాల్ (Nepal) ఎందుకు వెళ్లాననేది నాకు కూడా తెలియదు. వెంట తీసుకెళ్లిన డబ్బులన్నీ అయిపోవడంతో.. అక్కడొక రెస్టారెంట్‌లో పనిచేశా. అప్పుడయ్యింది నాకు జ్ఞానోదయం.

* ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఆల్మోస్ట్ చనిపోయానని అనుకున్నారు. ఒక్క సెకనులో అందరూ గుర్తొచ్చేశారు.

* రేపిస్ట్ పాత్రలకు మొదటి నుంచి నేను దూరం. ఒకసారి విజయ్ మాస్టర్.. ఒక అమ్మాయిని తీసుకువచ్చి.. ఆ సీన్ చేయమన్నారు.

* ఆశిష్ విద్యార్థి (Ashish Vidyarthi) అసలు డైలాగ్ బయటికి చెప్పరు. స్టార్టింగ్, ఎండింగ్ మాత్రమే చెబుతారు. మధ్యలో అలా పెదవులు కదిలిస్తారంతే. ఆయనకి ఎదురు డైలాగు చెప్పాలంటే కన్ఫ్యూజ్ అవుతాము. ఒకసారి నేను ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోయా. డైరెక్టర్ వచ్చి ఏంటి? అని అడిగారు.. అసలు నాకేం అర్థం కావడం లేదని చెప్పేశా..’’ ఇలా ఎన్నో విషయాలను.. అజయ్ ఈ కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు. ఆ విషయాలన్ని తెలియాలంటే ఆదివారం రాత్రి 8గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Updated Date - 2023-02-11T15:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising