ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2023-06-17T18:02:28+05:30

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Elections) కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR).. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Elections) కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR).. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రహస్య సర్వేలు (Secret Surveys) నిర్వహించిన బాస్.. అన్నిపార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇంతకీ ఈ ప్రకటన ఎప్పుడు ఉండొచ్చు..? ఎన్ని విడతలుగా అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నారు..? బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి..? సీక్రెట్ సర్వేలు ఎలా చేశారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంలో చూద్దాం..

ఇదీ అసలు కథ..

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు (119 Assembly Constituencies ) ఉన్నాయి. ఈసారి ఎలాగైనా సరే 100 స్థానాల్లో గెలిచి.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావలన్నది కేసీఆర్ ఆలోచన. ఇందుకు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అన్నీ వ్యూహాత్మకంగా చేసుకుంటూ వస్తున్నారట. మొదట అన్ని అసెంబ్లీ స్థానాల్లో మూడో కంటికి తెలియకుండా రహస్య సర్వేలు చేయించారట. ఇందులోని డేటా ఆధారంగా కేటాయించాలనుకున్న వారికి కేసీఆర్ పాస్‌మార్క్ స్కేలు పెట్టుకున్నారట. అసెంబ్లీ టికెట్ రావాలంటే 35 శాతంతో పాసైతే సరిపోదు.. కచ్చితంగా 40 నుంచి 45 శాతం వరకు పాజిటివ్ రేటింగ్ ఉంటేనే ఈసారి బీఫారం ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికైతే పాస్ పర్సెంటేజ్ ఉంటుందో వారందరి పేర్లతో తొలి జాబితాను రిలీజ్ చేయడానికి సీఎం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ 35 శాతం కూడా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదని సార్ ఫిక్సయ్యారట. ఎందుకంటే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా బాస్ భావిస్తున్నారు.. ఏ ఒక్క స్థానాన్ని చేజేతులారా పోగొట్టుకోకూడదన్నదే టార్గెట్!. ఎలాంటి పైరవీలకు చోటు లేకుండా బంధుత్వం, సన్నిహిత సంబంధాలు ఇలాంటివి అస్సలే చూడకుండా కేసీఆర్ సీక్రెట్ సర్వేలు చేయించారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రకటన ఎప్పుడు.. సరిగ్గా ఆ టైమ్‌లోనే ఎందుకు..?

అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై 15 (July-15th) తర్వాత ఏ క్షణంలో అయినా బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను (BRS MLA Candidates First List) స్వయంగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలిజాబితాలో మొత్తం 80 మంది అభ్యర్థులను (80 Candidates) ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. తొలి జాబితాలో ఉండే ఆ 80 మంది ఎవరన్న దానిపై ఇప్పుడు బీఆర్ఎస్‌ వర్గాల్లో, ఆశావహుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈసారి అయినా కేసీఆర్ కరుణించి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనుకున్న వారికి సీక్రెట్ సర్వేతో టెన్షన్ మొదలైందట. అయితే.. సరిగ్గా జులై రెండోవారంపైనే ఎందుకు ప్రకటన అంటే దీనికి పెద్ద ప్లానే ఉందట. ముందుగా ప్రకటన చేస్తే ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని సరిచేసుకునేందుకు ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చినట్లు అని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పట్నుంచి మరింత గ్రాఫ్ పెంచుకుని ఎక్కడ తేడాలున్నాయనేది నెగిటివ్‌ను పాజిటివ్ చేసుకునేందుకు ఈ వ్యవధిని బాస్ ఇస్తున్నారట. అంతేకాదు.. ప్రకటన తర్వాత ఇక ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకే పూర్తిగా పరిమితం కావాలని కీలక ఆదేశాలు కేసీఆర్ ఇవ్వబోతున్నారట. అంటే మొదటి జాబితాలో పేర్లు వచ్చిన వారికి కనీసం నాలుగు నెలలు సమయం దొరుకుతుందన్న మాట. దీంతో గ్రాఫ్ పెంచుకోవచ్చు.. అదే విధంగా కొద్దో గొప్పో ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి వెళ్లి తగ్గించుకొని ఎన్నికల నాటికి నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించుకోవచ్చన్నది కేసీఆర్ ప్లానట.

రెండో జాబితా ఎప్పుడొస్తుందో..?

మొదటి జాబితా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాకే రెండో జాబితా ఉండొచ్చని తెలుస్తోంది. జులై నెలాఖరున మిగిలిన 39 మంది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ 39 స్థానాల్లో అభ్యర్థులను చాలా ఆచితూచి ప్రకటన చేయాల్సి ఉందట. అంతేకాకుండా 10 నుంచి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉందని.. పైగా వామపక్షాలతో పాటు ఎంఐఎంతో పొత్తులు ఉంటే వారికి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అందుకే ఈ 39 స్థానాలపై మాత్రం కేసీఆర్ ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేదట. అవసరమైతే మరోసారి సర్వే చేయించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారట.

ఈ ప్రకటన వెనుక పెద్ద ప్లానే ఉందిగా..!

ఇన్ని రోజులు ముందుగానే కేసీఆర్ ఇలా అభ్యర్థులను ప్రకటించడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయట. గులాబీ బాస్ ప్రతి ఆలోచన వెనుక చాలా వ్యూహాలే ఉన్నాయట. ఎన్నికల ముందు.. టికెట్ దక్కని వారు తిరుగుబాటు చేసి రెబల్స్‌గా మారి వేరే పార్టీల్లో చేరిపోవడం, అంతర్గత విబేధాలు లాంటివి సర్వసాధారణమే. అయితే ఈసారి ఇలాంటివాటికి చోటివ్వకుండా ఉండేందుకే కేసీఆర్ ఇలా ముందుగానే వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటించబోతున్నారట. ఎందుకంటే రెబల్స్, కండువాలు మార్చే వారి వెళ్తేనే గెలుపు అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి..? ఎక్కడ ఎవర్ని ప్రోత్సహించాలి..? ఎవర్ని నేతగా తయారుచేయాలి..? ఇలాంటివాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి తగిన సమయం దొరుకుతుందన్నది కేసీఆర్ మాస్టర్ ప్లానట. ఏదైనా సరే నియోజకవర్గ స్థాయిలో సమస్యలుంటే ద్వితియ శ్రేణి నేతల ద్వారా వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి కూడా ఈ ప్రకటన తోడ్పడతుందట. ఇదొక్కటే కాదు.. చాలా విషయాలను పరిగణనలోనికి తీసుకుని కేసీఆర్ ముందడుగేస్తున్నారట.

వీళ్ల సంగతేంటో మరి..?

సీఎం కేసీఆర్, కీలక మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావులు (Harish Rao) జిల్లాల పర్యటన, బహిరంగ సభల్లో ఇప్పటికే 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఒక ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. హుజూరాబాద్ : పాడి కౌశిక్ రెడ్డి, భూపాలపల్లి : గండ్ర వెంకటరమణారెడ్డి, హుస్నాబాద్‌ : ఒడిదెల సతీష్, వర్ధన్నపేట : ఆరూరి రమే‌శ్, వరంగల్ పశ్చిమ : వినయ్‌ భాస్కర్‌, మిర్యాలగూడ : నల్లమోతు భాస్కరరావు, ఆందోల్‌ : చంటి క్రాంతి కిరణ్, అచ్చంపేట : గువ్వల బాలరాజు, దేవరకద్ర : ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎల్లారెడ్డి : జాజుల సురేందర్, ఇబ్రహీంపట్నం : మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సత్తుపల్లి : సండ్ర వెంకటవీరయ్య, నిజామాబాద్ అర్బన్‌ : గణేష్ గుప్తా, బోధన్‌ : షకీల్ అహ్మద్‌ , కూకట్‌‌పల్లి : మాధవరం కృష్ణారావు, కరీంనగర్‌ : గంగుల కమాలకర్, కరీంనగర్ ఎంపీ : బోయినపల్లి వినోద్ కుమార్‌లను అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే ఆ 80 మంది జాబితాలో కానీ.. ఆ తర్వాత జాబితాలో కానీ ఈ 16 మంది పేర్లు ఉంటాయా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మొత్తానికి చూస్తే.. అక్టోబరు 10 తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులేస్తున్నారని తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ ముందస్తు వెళ్లినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జాబితా తర్వాత బీఆర్ఎస్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంత మంది గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారో.. ఎంతమంది ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో అవకాశం వస్తుందని ‘కారు’ పార్టీలోనే ఉండిపోతారో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS Congress : తెలంగాణలో సీన్ రివర్స్.. ఊహకందని రీతిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేవంత్.. ఈ రెండే టార్గెట్..!


******************************

TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!

******************************

Janasena : పదే పదే పవన్ నోట అదే మాట.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. సమాచారం ఎవరిచ్చారో..?
******************************

AP Police : ఆనంపై అటాక్.. ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై పోలీసుల కామెడీ కథలు.. నమ్మకం లేదు దొరా..!

******************************

Updated Date - 2023-06-22T18:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising