కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ఒకేసారి బీజేపీలోకి 22 మంది ముఖ్య నేతలు..!?

ABN, First Publish Date - 2023-08-17T20:24:55+05:30

అవును.. మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోనుంది.! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నేతలు బీజేపీ (TS BJP) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. అది కూడా బీఆర్ఎస్ నుంచట.

TS Politics : తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. ఒకేసారి బీజేపీలోకి 22 మంది ముఖ్య నేతలు..!?

అవును.. మీరు వింటున్నది నిజమే.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకోనుంది.! ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది నేతలు బీజేపీ (TS BJP) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. అది కూడా బీఆర్ఎస్ నుంచట. ఇది నిజంగానే గులాబీ పార్టీకి వెన్నులో వణుకు పుట్టే విషయం.. ఈ విషయం ఎవరో కాదండోయ్ చెప్పింది.. చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender). గురువారం నాడు మీడియా మీట్‌లో భాగంగా స్వయంగా ఆయనే చెప్పడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈటల ఇంకా ఏమేం చెప్పారు..? ఇంత కచ్చితంగా చెబుతున్నారంటే అర్థమేంటి..? ఈయన కామెంట్స్‌పై కమలనాథులు ఏం చెబుతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనం..!


bjp.jpg

బీజేపీ డీలా పడిందిలా..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడంతో బీజేపీ బొక్కబోర్లా పడిపోయింది. ఈ గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎనలేని ఉత్సాహం వచ్చింది. మునుపెన్నడూలేని విధంగా కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్‌తో (BRS) ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఒక్క బీజేపీకి మాత్రమే ఉండేది. కానీ ఒకే ఒక్క గెలుపుతో సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు బీఆర్ఎస్‌కు వన్ అండ్ ఓన్లీ ప్రత్యర్థి కాంగ్రెస్సే (Congress). ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా సత్యం. ఎందుకంటే సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు (KTR, Harish Rao) ఎవర్ని అయితే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో దాన్ని బట్టి సీన్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓ వైపు సర్వే సంస్థలు.. మరోవైపు ఇంటెలిజెన్స్‌తో సర్వేలు (Intelligence Survey) చేయించగా కాంగ్రెస్‌కు కొన్ని సర్వేలు రావడం.. మరికొన్ని కాంగ్రెస్సే అధికారంలోకి రావొచ్చని కూడా చెప్పడంతో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని సర్వేల్లో బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. పైగా మునుపటితో పోలిస్తే కాంగ్రెస్ కూడా చాలా బలపడింది. చేరికలు జోరుగా ఉండగా.. మునపటిలా గొడవల్లేవ్.. నాయకులంతా ఒకేథాటి పైకి వచ్చి ముందకు అడుగులేస్తున్నారు. పైగా ఇప్పుడు చేరికలు ఏమున్నా కాంగ్రెస్‌లోకి మాత్రమే నడుస్తున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి కూడా ఆఖరికి కాంగ్రెస్‌లోకే చేరికలు ఉంటున్నాయి. దీంతో తెలంగాణలో బీజేపీ స్థానం ఎక్కడుంది అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి.

ఇదీ అసలు కథ..!

బీజేపీ పనైపోయిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ (BRS, Congress) భావిస్తున్న టైమ్‌లో ఇప్పుడే అసలు సినిమా మొదలైందన్నట్లుగా ఈటల రాజేందర్ ఉన్నట్లుండి బాంబ్ పేల్చారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎంత మంది పార్టీలో చేరతారనే దానిపై నంబర్లతో సహా చెప్పేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది ముఖ్యనేతలు బీజేపీలో చేరుతారని స్పష్టం చేశారు. ఈ చేరికలతో అధికార బీఆర్ఎస్ పార్టీలో వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు. అయితే ఆ 22 మంది నేతల పేర్లు మాత్రం బయటికి పొక్కకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికార పార్టీ గురించే ఈటల చెబుతుంటే.. కారు దిగి కాషాయ పార్టీలో చేరడానికి నేతలు సిద్ధమైనట్లు అర్థం చేసుకోవచ్చు. అంటే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ నుంచి చేరికలు ఉంటాయన్న మాట.

రియాక్షన్ ఇలా..?

మరోవైపు.. ఈటల ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఇలాంటి మాటలే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీలో చేరిన మరుసటి రోజు నుంచి ఇదే మాటలు చెబుతున్న పరిస్థితి. అయితే ఇంతవరకూ ఒకరిద్దరు తప్పితే బీఆర్ఎస్ పెద్ద తలకాయలెవ్వరూ చేరిన దాఖలాల్లేవ్. పైగా ఈ మధ్య బీజేపీలో బడా నేతలే కాషాయ కండువా తీసేసి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరిపోతున్న పరిస్థితి. ఈటల చేసిన ఈ కామెంట్స్‌ను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే నమ్మే పరిస్థితుల్లో లేరట. ఎందుకంటే ఈటల పదే పదే చెబుతున్నప్పటికీ చేరికలు మాత్రం శూన్యం. దీంతో కార్యకర్తలు మొదలుకుని ఢిల్లీలోని కమలనాథుల వరకూ ‘మాకు నమ్మకం లేదు ఈటలా’ అనే భావనలో ఉన్నారట. ఇన్నిసార్లు చెప్పిన మాటలు పక్కనెడితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కచ్చితంగా ఈటల చెప్పింది జరిగి తీరుతుందని మాత్రం ఒకరిద్దరు కమలనాథులు గట్టిగానే నమ్ముతున్నారట. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో..? ఈటల చెప్పినట్లే జరుగుతుందో లేదో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


TS Assembly Elections 2023 : కేసీఆర్ ప్రకటించబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే.. 10 ఉమ్మడి జిల్లాలకు ఫిక్స్..!?


Governor Vs KCR Govt : గవర్నర్-గవర్నమెంట్ మధ్య మరింత దూరం.. చెన్నై వేదికగా కేసీఆర్‌ను తమిళిసై ఏమన్నారో తెలిస్తే..!?


Independence Day : బాబోయ్ ఏంటిది.. వైసీపీ రిలీజ్ చేసిన ఈ ఫొటో చూశాక.. ఇక మీ ఇష్టం..!


TS Assembly Elections 2023 : మంత్రి సబిత- తీగల చెట్టాపట్టాల్.. అరగంట పాటు రహస్య సమావేశం..!


BRS : ఐదుసార్లు సర్వే చేయించినా ఆ మంత్రిపై నెగిటివ్‌గానే ఫలితం.. టికెట్ లేనట్టే..!?


AP Politics : ఏపీ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌కు ఇంత భయమెందుకో..!?


Updated Date - 2023-08-17T20:29:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising