Balineni Row : బాలినేనికి సీఎం వైఎస్ జగన్ బుజ్జగింపులు.. ఈసారైనా తేల్చేస్తారా.. లేకుంటే..!
ABN, First Publish Date - 2023-06-01T16:40:25+05:30
వైసీపీలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ (Tadepalli CM Camp Office) వేదికగా మరోసారి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నేరుగా వెళ్లి..
వైసీపీలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ (Tadepalli CM Camp Office) వేదికగా మరోసారి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నేరుగా వెళ్లి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (CM YS Jagan Mohan Reddy) జరిగిన భేటీలో చర్చలు ఒక్కసారీ సక్సెస్ కాలేదు. దీంతో బాలినేని ఎపిసోడ్‌కు (Balineni Episode) నాటి నుంచి నిన్నటివరకూ ఫుల్‌స్టాప్ పడలేదు. బుధవారం నాడు మరోసారి సీఎంవో (AP CMO) నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లింది. గురువారం సాయంత్రం 4 గంటలకు క్యాంప్ ఆఫీసుకు రావాలని.. వైఎస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడతారన్నది ఆ ఫోన్ కాల్ సందేశం.
రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఒంగోలు నియోజకవర్గానికి మాత్రమే బాలినేని పరమితం అయ్యారు. అయితే సీనియార్టీ, ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించే వ్యక్తని పేరు ఉండటంతో ఈయనకే మరోసారి రిజనల్ కో-ఆర్డినేటర్ (Regional Co-Ordinator) పదవిని కట్టబెట్టాలన్నది జగన్ రెడ్డి (YS Jagan Reddy) ఆలోచనట. అందుకే సీఎంవోకు జగన్ పిలిపించుకున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. సాయంత్రం 4 గంటల సమయంలో సీఎంవోకు వచ్చిన బాలినేని-జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల నుంచి ఇద్దరి మధ్య ఏకాంతంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ భేటీతో అయినా బాలినేని ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందేమో అని అటు శ్రీనివాస్ వీరాభిమానులు.. ఇటు వైసీపీ కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత నుంచి మాజీ మంత్రి విషయంలో నెలకొన్న పరిణామాలన్నింటినీ ప్రస్తావించి మరీ జగన్ క్లాస్ తీసుకునే ఛాన్స్ ఉందట.
లెక్క తేలేనా..!?
మరోవైపు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకున్న పలుకుబడిని.. తానే పని చేయాలన్నా ఎవరూ సహకరించట్లేదని.. సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆ మధ్య మీడియా ముందే చెబుతూ బాలినేని కంటతడిపెట్టిన విషయం తెలిసిందే. అధికారుల బదిలీ, ప్రోటోకాల్ విషయంలో అవమానాలు జరుగుతున్నాయని కూడా బాలినేని ఆవేదన చెందారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు కారణంగానే నియోజకవర్గానికి బాలినేని పరిమితం అయ్యారని వాసు అభిమానులు, అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాలపై జగన్‌తో భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బాలినేనితో మాట్లాడిన తర్వాత వైవీ సుబ్బారెడ్డితో కూడా జగన్‌కు టచ్‌లోకి వెళ్లి ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాలను తొలగించాలనే యోచనలో జగన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ రిజనల్ కో-ఆర్డినేటర్ పదవి తీసుకోవాల్సిందేనని జగన్ పట్టుబడితే బాలినేని ఎలా రియాక్ట్ అవుతారు..? సొంత జిల్లా విషయంలో బాలినేని జగన్‌కు ఏం చెబుతారు..? ఈ మొత్తమ్మీద బాలినేని-వైవీ విషయంలో జగన్ ఏం తేల్చబోతున్నారు..? అనే విషయాలపై వైసీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తాజా భేటీ తర్వాత అయినా బాలినేని ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందో లేదో చూడాలి మరి.
Updated Date - 2023-06-01T16:43:59+05:30 IST