ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yediyurappa: యడియూరప్పను బీజేపీ వేధించింది.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-04-22T21:47:05+05:30

కర్ణాటక రాష్ట్ర సీనియర్‌ నేత బీఎస్ యడియూరప్ప(B.S.Yediyurappa)ను బీజేపీ వేధించిందని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర సీనియర్‌ నేత బీఎస్ యడియూరప్ప(B.S.Yediyurappa)ను బీజేపీ వేధించిందని, ఆయన కన్నీరు వీధుల్లో ప్రవహించిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఆరోపించారు. కర్ణాటక రౌండ్‌టేబుల్‌ సమావేశంలో శనివారం రాత్రి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సొంత పార్టీ నేత యడియూరప్పను వేధించడం రహస్యం కాదన్నారు. దక్షిణాదిన బీజేపీని స్థాపించడంలో యడియూరప్ప కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. యడియూరప్పను పలు విధాలుగా వేధించారని అన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 140 సీట్లు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పాలన అవినీతిలో కూరుకుపోయిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ(Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) రాష్ట్రంలో ఎన్నికలు నడపలేరన్నారు. రాష్ట్ర ప్రజలు విద్యావంతులని, ఇక్కడ అవినీతికి అవకాశం ఉండదని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న లింగాయతలు రాజకీయంగా ప్రతిభావంతులని, ప్రస్తుతం ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం తమకు అనుకూలమన్నారు.

Updated Date - 2023-04-22T21:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising