ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS First List : బీఆర్ఎస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వారిపై ఎమ్మెల్యే భర్త ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2023-09-05T17:03:19+05:30

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై (BRS First List) ఇంకా అసంతృప్తి ఆగలేదు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. ఫలానా అభ్యర్థికి ఇచ్చిన టికెట్‌ను (MLA Ticket) వెనక్కి తీసుకోండని ద్వితియ శ్రేణి నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు డిమాండ్ చేస్తున్నారు...

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాపై (BRS First List) ఇంకా అసంతృప్తి ఆగలేదు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. ఫలానా అభ్యర్థికి ఇచ్చిన టికెట్‌ను (MLA Ticket) వెనక్కి తీసుకోండని ద్వితియ శ్రేణి నేతలు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మల్కాజిగిరి విషయంలో అయితే.. అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ మైనంపల్లి హన్మంతరావు (Mynampalli Hanumantha Rao) పోటీచేస్తారా..? లేదా అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక టికెట్లు దక్కని కొందరు సిట్టింగులు అయితే పక్క చూపులు చూస్తుండగా.. మరికొందరు ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇక.. టికెట్లు ఆశించి భంగపడిన వారు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులపై తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు.


ఏమిటీ మాటలు..?

మల్కాజిగిరికి మైనంపల్లి.. మెదక్ అసెంబ్లీ టికెట్ ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohit) ఆశించారు. హన్మంతరావుకు మాత్రమే టికెట్ దక్కిందిగానీ.. రోహిత్‌కు దక్కలేదు. దీంతో పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ఆయన కారు దిగి.. వేరే పార్టీ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి. సరిగ్గా ఈ క్రమంలోనే ఏడుపాయలలో బంగారం, వెండి ఆభరణాలు మిస్సయ్యాయి. దీంతో వనదుర్గ మాత ఆభరణాలకు భద్రత కరువైందని హిందూ, ప్రజా సంఘాలు.. ప్రతిపక్ష పార్టీ నేతలు.. టికెట్ ఆశించి రాని నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (MLA Padma Devender Reddy) భర్త, ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మీడియా మీట్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాపై, ఎమ్మెల్యే పైనా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్లు ఆశించి భంగపడ్డ వారు మాపై విష ప్రచారం చేస్తున్నారు. మెదక్‌ను అభివృద్ధి చేయడమే మా సంకల్పం. కొందరు కుట్రపూరితంగా బురదజల్లుతున్నారు’ అని దేవేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

నిరూపించండి..!

‘మేం తప్పు చేసినట్లు నిరూపిస్తే రాందాస్ చౌరస్తాలో ముక్కునేలకు రాస్తాను. ఏడుపాయల ఘటనపై (Edupayala Incident) నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ చేయాలి. తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. నాపై ఆరోపణలు చేసినోళ్లు నా దగ్గర పని తీసుకున్నోళ్లే. లోటుపాట్లు జరిగితే శిక్షించాల్సిందే. ఈఓను సస్పెండ్ చేయాల్సిందే. విచారణ జరుగుతోంది..అక్రమాలు ఉంటే తప్పకుండా చర్యలుంటాయి’ అని ఎమ్మెల్యే భర్త హెచ్చరించారు. కాగా.. గతంలో కూడా పలుమార్లు ఆలయంలో నగలు, నగదు చోరీకి గురైన విషయం విదితమే. ప్రస్తుత ఈఓ, ఆలయ కమిటీ చైర్మన్​ మధ్య కోల్డ్​వార్​నడుస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆలయం వద్ద భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోగా రాజకీయ జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. ఎన్నికల్లో పోటీచేస్తున్న పద్మా దేవేందర్ రెడ్డికి ఇది ఎంతవరకు మైనస్ అవుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Telangana : ఎన్నికల ముందు మరో తీపికబురు చెప్పిన సీఎం కేసీఆర్..!


Viveka Murder Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఆర్డర్ కాపీలో కీలక అంశాలు


LB Nagar Incident : సంఘవి ఆరోగ్యంపై షాకింగ్ విషయం చెప్పిన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్


TS Assembly Polls : కాంగ్రెస్ కీలక నేతతో రాజయ్య రహస్య భేటీ.. 45 నిమిషాలు అసలేం జరిగింది..!?


YSR Congress : గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదా.. వాట్ నెక్స్ట్..!?


Updated Date - 2023-09-05T20:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising