ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Jagan House : బాబోయ్.. పేరుకేమో రూపాయి సీఎం వైఎస్ జగన్.. ఈ విషయంగానీ మీకు తెలిసిందో..!

ABN, First Publish Date - 2023-03-31T21:46:40+05:30

అవును.. మా అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) జీతం (Jagan Salary) తీసుకోవట్లేదు.. ఒకే ఒక్క రూపాయి (One Rupee) మాత్రమే ప్రతినెలా తీసుకుంటున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అవును.. మా అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) జీతం (Jagan Salary) తీసుకోవట్లేదు.. ఒకే ఒక్క రూపాయి (One Rupee) మాత్రమే ప్రతినెలా తీసుకుంటున్నారు.. దేశంలోనే జగన్ గొప్ప నాయకుడు.. అసలు ఎవరైనా ఇలాంటి నేత ఉన్నారా..? అని వైసీపీ నేతలు (YSRCP Leaders) మీడియా ముందుకొచ్చి తెగ ఊదరగొడుతుంటారు. అయితే ఇవన్నీ మీడియా ముందు మాత్రమే లోలోపల కథ వేరేలా ఉందనేదానికి ఇప్పటి వరకూ పలు విషయాలు తార్కాణంగా నిలవగా.. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అదేమిటి..? దానికోసం ఎన్నికోట్లు ఖర్చుపెట్టారనే విషయాలపై ప్రత్యేక కథనం.

ఇదీ అసలు కథ..

ఒకే ఒక్క రూపాయి మాత్రమే నెలకు తీసుకుంటానని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్.. ఆయనకు అయ్యే ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లి నివాస గృహం, క్యాంపు ఆఫీసుకు కొత్తగా కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంత చేసిన తర్వాత ఇవన్నీ భద్రతా కారణాల దృష్ట్యా అని సింపుల్‌గా ఒక్క మాటతో తేల్చేశారు. వాస్తవానికి జగన్ ముఖ్యమంత్రి అయినా దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఆయన ఇంటికోసం , పరిసరాల అభివృద్ధి కోసం కోట్లు ఖర్చుపెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ అటుంచితే ఇప్పుడు జగన్ ఇంటి దగ్గర ప్రత్యేకంగా హెలిప్యాడ్ (Helipad at Jagan House) ఏర్పాటు చేయించుకుంటున్నారు. అధికారంలో ఉన్నాం కదా.. ఇక మనం చెప్పిందే వేదం.. ఏం చేసినా అడ్డు చెప్పేదెవరన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఎంత డబ్బో చూడండి..!

హెలిప్యాడ్ కోసం రూ. 1.89 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

  • హెలిప్యాడ్‌, దానికి ఫెన్సింగ్‌ కోసం : రూ.40 లక్షలు

  • హెలిపాడ్‌ వద్ద గార్డ్‌ రూమ్‌ , ఇతర సదుపాయాలకోసం : రూ. 13.50 లక్షలు

  • సీఎం నివాసం వద్ద పర్మినెంట్‌ ఇనుప చట్రాలతో బారికేడింగ్‌ కోసం : రూ. 75 లక్షలు

  • సీఎం ఇంటి సమీపంలోనే పోలీస్‌ బ్యారెక్‌, సదుపాయాలకోసం : రూ. 30 లక్షలు

  • సెక్యూరిటీ పోస్ట్‌, సెక్యూరిటీ గేట్స్‌, పోర్టబుల్ క్యాబిన్‌ల కోసం : రూ. 31 లక్షలు.

వాస్తవానికి ఇప్పటికే.. దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ (Chief Minister) లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో సెక్యూరిటీని పెంచారని.. ఈ పరికరాల కొనుగోలు, ఇన్‌స్టాలేషన్‌కు రూ. 2 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా హెలిప్యాడ్ కోసం ఇంత డబ్బులు ఖర్చుపెట్టడం ఇవన్నీ చూస్తున్న సామాన్య ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియా నెటిజన్లు.. పేరుకేమో రూపాయి సీఎం.. చేసేవన్నీ మాత్రం కోటాను కోట్లు ఖర్చుల పనులంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోతున్నారట. ఇప్పటి వరకైతే ఇవి.. మున్ముందు ఇంకా ఎన్నెన్ని కోట్లు ప్రజాధనాన్ని జగన్ ఖర్చు పెడతారో ఏంటో..!

******************************

ఇవి కూడా చదవండి

******************************

YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

******************************

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

******************************

Updated Date - 2023-03-31T21:55:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising