కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Elections : ముగ్గురు అభ్యర్థులను మార్చే యోచనలో కాంగ్రెస్.. సడన్‌గా ఎందుకంటే..!?

ABN, First Publish Date - 2023-11-05T19:36:29+05:30

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Elections) గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress).. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మిగిలిన అభ్యర్థుల విషయంలో చేసిన కసరత్తులు పూర్తయ్యాయి..

TS Elections : ముగ్గురు అభ్యర్థులను మార్చే యోచనలో కాంగ్రెస్.. సడన్‌గా ఎందుకంటే..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Elections) గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ (Congress).. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం.. మిగిలిన అభ్యర్థుల విషయంలో చేసిన కసరత్తులు పూర్తయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో మిగలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించబోతోంది. అయితే.. అనూహ్యంగా.. ముగ్గురు అభ్యర్థులను (Three Candidates) మార్చడానికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే.. ఏ ఒక్క స్థానాన్ని చేజేతులారా వదులుకోకూడదని చెయ్యి పార్టీ పక్కా వ్యూహంతోనే ముందుకెళ్తోంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త, సర్వేల (Survey) ఆధారంగా ఈ మార్పులు, చేర్పులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


BRS-CONGRESS-3-4.jpg

ఎవరా ముగ్గురు..?

ఇప్పటి వరకూ 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో ఆదివారం నాడు 60 మందికి బీఫామ్‌లను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ నిరంజన్, ఏఐసీసీ సెక్రెటరీ విష్ణునాధ్ అందజేశారు. ఇంకా 37 మంది అభ్యర్థులు బీ ఫామ్ తీసుకోవాల్సి ఉంది. అయితే.. ఇందులో మూడు సెగ్మెంట్ల అభ్యర్థుల బీ-ఫామ్‌లను కమిటీ, అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. ఎందుకంటే.. బోథ్, చేవెళ్ల, వనపర్తి నియోజకవర్గాల అభ్యర్థులను మార్చే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ముగ్గురు ఎవరు..? ఇంతకీ ఆ మూడు నియోజకవర్గాలు ఏమిటి..? అని తెలుసుకోవడానికి పార్టీ శ్రేణులు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో బీఫామ్‌లు తీసుకోని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఆ ముగ్గురిలో తామెక్కడ ఉన్నామో అని అభ్యర్థులు.. తమ అభిమాన నాయకుడు ఎక్కడున్నాడో అని అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

ఎవరికి ఇవ్వొచ్చు!

ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ (BRS) నుంచి కొందరు సిట్టింగులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు అందరికీ కాంగ్రెస్ టికెట్లు ఇచ్చినప్పటికీ ఒకరిద్దరికీ ఇవ్వలేకపోయింది. అయితే.. ఇటీవల చేసిన సర్వేలో ఆ జంపింగ్ నేతలే పక్కాగా గెలుస్తారని తేలిందట. అందుకే ఆ మూడు స్థానాలను బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన నేతలకే ఇవ్వాలని అధిష్టానం ఫిక్స్ అయ్యిందట. అంతేకాదు.. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి ముఖ్య నేతలు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని టాక్ నడుస్తోంది. అందుకే ఆ మూడూ పెండింగ్‌లో పెట్టారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఆ ముగ్గురు ఎవరనేది క్లారిటీగా తెలియట్లేదు కానీ.. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం ఇద్దరి ముగ్గురి పేర్లు మాత్రం గట్టిగానే ప్రచారం జరుగుతున్నాయి. ఫైనల్‌గా ఆ ముగ్గురు ఎవరు అనేది ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి


TS Polls : అనూహ్య నిర్ణయం.. కేసీఆర్‌పై ఎవరు పోటీచేస్తున్నారో చూడండి!


Vijayashanti : రాములమ్మకు రేవంత్ రెడ్డి బంపరాఫర్.. రేపోమాపో కండువా కప్పుకోవడమే ఆలస్యమట!!

Updated Date - 2023-11-05T20:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising