ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: కేసీఆర్-చంద్రబాబు భేటీపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-11-28T16:08:58+05:30

Telangana Politics: తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారిన వేళ సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలవాలని కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రయత్నం చేశారని.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తెలిసే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని నారాయణ అన్నారు. కానీ కేసీఆర్‌ను కలవడానికి చంద్రబాబు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారిన వేళ సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబును కలవాలని కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రయత్నం చేశారని.. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటమి తెలిసే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని నారాయణ అన్నారు. కానీ కేసీఆర్‌ను కలవడానికి చంద్రబాబు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత కేసీఆర్‌, కేటీఆర్‌ తీరు అందరూ గమనించారని.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మద్దతు కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఖమ్మం ఎన్నికల ప్రచారంలో సీపీఐ నేత నారాయణ కామెంట్ చేశారు.

కాగా అందరికీ సన్‌స్ట్రోక్ ఉంటుందని.. కానీ కేసీఆర్‌కు డాటర్ స్ట్రోక్ ఉందంటూ సీపీఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వల్ల బీజేపీకి కేసీఆర్ తలొగ్గారని ఆరోపించారు. ఖమ్మంలో తులసి మొక్కకు.. గంజాయి మొక్కకు మధ్య పోటీ ఉందని నారాయణ అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం మునిగింది.. కల్వకుంట్ల కుటుంబం ఖజానా నిండిందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులు నొక్కే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-28T16:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising