ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Luthra On CBN : చంద్రబాబు బెయిల్‌పై బయటికొచ్చాక సిద్ధార్థ లూథ్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్

ABN, First Publish Date - 2023-11-01T10:52:48+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయ్యి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. 52 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత జైలు నుంచి బాబు బయటికి రావడంతో ఓవైపు ఉద్వేగం.. మరోవైపు ఉత్సాహం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయ్యి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. 52 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత జైలు నుంచి బాబు బయటికి రావడంతో ఓవైపు ఉద్వేగం.. మరోవైపు ఉత్సాహం.. ఎదురు చూస్తున్న వేల కళ్లు.. నింగినంటుతున్న నినాదాలు!. తరలివచ్చిన జన సంద్రంతో ఇలాంటి ఒక ఉద్వేగ భరిత వాతావరణం మధ్య.. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చారు. ‘జై బాబు... జైజై బాబు’ నినాదాలతో ఆ పరిసరాలను మార్మోగించారు. సోషల్ మీడియా.. మీడియా వేదికగా రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. తాజాగా.. చంద్రబాబును బయటికి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడిన ప్రముఖ లాయర్ సిద్ధార్థ లూథ్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. లూథ్రా చేసిన ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో.. నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది.


ఇదీ ట్వీట్ సారాంశం..

తెలివైనవారిలో తెలివైన వాడు.. బలహీనులను రక్షించేవాడు.. నిరంకుశులను నాశనం చేసేవాడు సాత్వికులను (సౌమ్యులను) కాపాడేవాడుఅని చంద్రబాబును ఉద్దేశించి లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఈ పదాలు ఎక్కడ్నుంచి.. ఎవరు చెప్పారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. తాను చెప్పిన ఈ వాఖ్యం ఫర్నామాలోని సిక్కుల పదో గురువు అమర పదాలుఅని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక కొందరు వైసీపీ కార్యకర్తలు ఎప్పటిలాగే పైత్యం ప్రదర్శిస్తూ సిల్లీగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

ఇదీ లూథ్రా అంటే..!!

మొత్తానికి చూస్తే.. సిద్ధార్థ లూథ్రా చేసిన తాజా ట్వీట్‌తో మున్ముందు ఏదో శుభపరిణామమే జరగబోతోందని టాక్ కూడా గట్టిగానే నడుస్తున్న పరిస్థితి. చంద్రబాబు అరెస్ట్, బెయిల్‌ విచారణలపై ఆ మధ్య ఈయన చేసిన ట్వీట్లు కూడా వైరల్ అయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా.. చంద్రబాబు కేసులన్నింటినీ ఏసీబీ కోర్టు మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. లూథ్రా వాదనలకు ప్రత్యర్థి సీఐడీ లాయర్లు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సైతం నోరెళ్లబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సిద్ధార్థ లేవనెత్తిన లాజిక్ పాయింట్లు, టెక్నికల్ ఇష్యూస్‌తో సుప్రీంకోర్టులోనే పలుమార్లు నిశ్శబ్ధ వాతావరణం నెలకొందంటే ఇక ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు.

Updated Date - 2023-11-01T10:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising