ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagan Adani : వైఎస్ జగన్ రెడ్డితో అదానీ భేటీ.. ప్రేమతో ఈసారి బిగ్ డీల్..!?

ABN, First Publish Date - 2023-09-28T19:13:05+05:30

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) భేటీ కాబోతున్నారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు అదానీ...

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) భేటీ కాబోతున్నారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చారు అదానీ. మరికాసేపట్లో తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి జగన్‌తో భేటీ కాబోతున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఇంట్లోనే జగన్‌తో కలిసి అదానీ డిన్నర్‌లో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు నేపథ్యంలో అదానీతో సీఎం డిన్నర్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఏపీలో వ్యాపార సంబంధ వ్యవహారాలపై మాట్లాడేందుకు వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉందిగానీ.. ఇంత సడన్‌గా అదానీ ఎందుకొచ్చారు..? ఇప్పటికే అప్పన్నంగా కోట్ల రూపాయిలు విలువచేసే ప్రాజెక్టులు కట్టబెట్టిన జగన్.. ఈసారి అదానీకి ఏమివ్వబోతున్నారు..? తాడపేల్లి ప్యాలెస్ వేదికగా ‘బిగ్ డీల్’ (Big Deal) ఏదైనా జరగబోతోందా..? అనేది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.


ఇప్పటి వరకూ ఇలా..?

వాస్తవానికి.. అదానీ వ్యవహారంపై ఆ మధ్య అటు దేశం, ఇటు పార్లమెంటు అట్టుడికిపోతున్న తరుణంలో.. న్యూస్‌ చానళ్ల స్టూడియోలు, మీడియా ఏకిపారేస్తున్న పరిస్థితుల్లో.. అదానీ పెట్టుబడులు కుదేలవుతున్న స్థితిలో.. ఒక్కసారిగా ఈ కంపెనీ షేర్ల పతనం అయినా.. అదానీ గ్రూప్‌ కంపెనీలపై వైసీపీ సర్కారు అంతులేని ప్రేమ కించిత్తు కూడా తగ్గకుండా ఒలకబోసింది. రాష్ట్ర కేబినెట్‌ భేటీలో ఆ సంస్థకు చెందిన కంపెనీలకు భారీగా భూ సంతర్పణ చేసింది. వందల ఎకరాల భూములను కేబినెట్‌ సమావేశంలో పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు, డేటా సెంటర్‌ల కోసం కేటాయించింది. అంతేకాదు.. విశాఖలో మరో డేటా సెంటర్‌కు 60 ఎకరాలు కట్టబెట్టింది జగన్ సర్కార్. 139 ఎకరాల్లో ఇప్పటికీ పనులు మొదలేకానప్పటికీ అదానీ గ్రూప్‌నకు మాత్రం అదనంగా భూములు ఇచ్చేసింది ప్రభుత్వం. దీంతో అదానీపై ఇంత ప్రేమ ఎందుకో అని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంచలన కథనాలు ప్రచురించింది.. ప్రసారం చేసింది కూడా. ఈ కథనాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెను సంచలనమే అయ్యాయి.

ఈ భేటీ అంతర్యమేంటి..?

పైన చెప్పిన విషయాలన్నీ అటుంచితే.. ఇప్పుడు ఉన్న ఫలంగా అహ్మదాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు అదానీ ఎందుకు రావాల్సి వచ్చింది..? ఒక పేరుగాంచిన బిజినెస్‌మెన్ స్వయంగా సీఎం ఇంటికే వచ్చారంటే.. అందులో ఎలాంటి లాభం లేకుండా.. ఏదో ఒక లిటిగేషన్ లేకుండా రారన్నది జగమెరిగిన సత్యమే. అలాంటిది ఇప్పుడు అదానీ ఎందుకొచ్చారు..? ఇప్పటి వరకూ కట్టబెట్టింది చాలక కొత్తగా ఆయనకు ఏమివ్వబోతున్నారు..? ఇప్పటి వరకూ ఇచ్చింది కాకుండా కొత్తగా ఇవ్వడానికి ఏపీలో ఇంకేముంది..? భూములు, డేటా సెంటర్, పోర్టులు.. ఇలా అదానీ వేలెత్తి చూపించిందల్లా ఇచ్చేసిన వైఎస్ జగన్.. ఇప్పుడు ‘బిగ్ డీల్’ జరుపుకోబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే నడుస్తోంది.

ఇంతకీ ఆ డీల్ ఏమిటి..? అనేది క్లారిటీగా తెలియట్లేదు కానీ.. ఈ మధ్యనే జగన్ ముందస్తుకు వెళ్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అలా వార్తలు రావడం.. ఇలా అదానీ తాడేపల్లిలో వాలిపోవడానికి ఏదో లింకు ఉందనే ఆరోపణలు లేకపోలేదు. ఇన్నిరోజులుగా తాను సహకరిచినందుకుగాను.. ప్రతిఫలంగా ఈ భేటీలో బిగ్ డీల్ జరగబోతోందని సమాచారం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫండ్’ మొత్తం అదానీనే పెట్టబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. మరి ఈ డిన్నర్ భేటీ ఆంతర్యమేంటి..? ఏం చర్చించారనే విషయాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి. బహుశా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


YuvaGalam : నాన్నకు ప్రేమతో.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా


CBN Case : చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ మరో కుట్ర..!



Updated Date - 2023-09-28T19:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising