ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..

ABN, First Publish Date - 2023-05-15T17:20:18+05:30

కర్ణాటక తదుపరి సీఎం (Karnataka Next CM) ఎవరనే ఉత్కంఠకు ఒకట్రెండు గంటల్లో తెరపడనుంది. అటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidda Ramaiah), ఇటు కన్నడ కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటక తదుపరి సీఎం (Karnataka Next CM) ఎవరనే ఉత్కంఠకు ఒకట్రెండు గంటల్లో తెరపడనుంది. అటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Sidda Ramaiah), ఇటు కన్నడ కాంగ్రెస్ అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ (DK Shivakumar).. తానంటే తానని పరోక్షంగా చెప్పేస్తున్నారు. దీంతో సీఎం ఎంపిక బాధ్యత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అధిష్టానం అప్పగించింది. ఈ ఇద్దర్నీ ఢిల్లీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చింది అధిష్టానం. ఇద్దర్నీ కూర్చోబెట్టి లెక్కలేదో తేల్చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దా ఢిల్లీకి వెళ్లగా.. డీకే మాత్రం ఇంకా హస్తినకు పయనం కాలేదు. బెంగళూరులో తన మద్దతుదారులతో కీలక సమావేశం నిర్వహించిన తర్వాత.. అది కూడా ఢిల్లీ వెళ్లే ముందు తన ఇంట్లో ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టిన డీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ హస్తినలో హాట్ టాపిక్ అయ్యాయి.

ఎంతో కష్టపడ్డా..!

సీఎం ఎవరన్నదానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది. నా రాజకీయ గురువును కలవబోతున్నాను. ఆ తర్వాతే ఢిల్లీకి వెళ్తాను. పార్టీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను. నేను ఒంటరిగానే పార్టీని గెలిపించుకున్నాను. నా అధ్యక్షతన 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించాను. 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లినా ధైర్యం కోల్పోలేదు. కాంగ్రెస్ నేతలందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చాను. కాంగ్రెస్ నేతలంతా గెలుపుకోసం సహకరించారు. సిద్ధారామయ్యతో నాకు ఎలాంటి విబేధాలు లేవు. నా బర్త్ డే వేడుకల్లో కూడా సిద్ధా రామయ్య పాల్గొన్నారు. నాకున్న మద్దతుదారుల సంఖ్యను చెప్పనుఅని డీకే చెప్పుకొచ్చారు.

మొత్తానికి చూస్తే.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయం తేల్చక మునుపే డీకే ప్రెస్‌మీట్ పెట్టి మరీ చేసిన కామెంట్స్ అటు కర్ణాటకలో.. ఇటు ఢిల్లీల్లో చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా 135 మంది ఎమ్మెల్యేలను తన అధ్యక్షతన గెలిపించుకున్నానని డీకే చెప్పడం పెను సంచలనమే అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మొత్తం ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ గెలుపు కోసం అంతా తానే చేశానని చెప్పడం.. తనకు తప్ప సీఎం సీటు వేరొకరికి ఇవ్వకూడదన్నట్లుగా అన్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. డీకే చేసిన ఈ కామెంట్స్ తర్వాత ఢిల్లీ వేదికగా పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశాలు మాత్రం మెండుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం సీఎంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై మరింత సస్పెన్ నెలకొంది.

Updated Date - 2023-05-15T17:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising