ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YuvaGalam : యువగళం పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. సైకాలిజిస్ట్ ప్రశ్నకు నారా లోకేష్ ఇచ్చిన ఆన్సర్ ఒక్కసారి వింటే..!

ABN, First Publish Date - 2023-07-03T23:00:48+05:30

యువగళం (Yuvagalam) పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్న యువ నాయకుడు లోకేష్ యువగళం (Lokesh Yuvagalam) పాదయాత్ర నెల్లూరులో విజయవంతంగా సాగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా.. అనిల్ గార్డెన్స్‌లో ‘మహిళా శక్తితో లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్, లోకేష్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. నేను బాడీ షేమింగ్‌ బాధితుడ్నే.. శరీరాకృతి పట్ల హేళన ఎదుర్కొంటున్నవారిలో నేను కూడా ఉన్నాను. ఇప్పటికీ శాసనసభలో మా నాయకుడు అచ్చెన్నాయుడిని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ చేస్తున్నారు.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీడీపీ యువనేత నారా లోకేష్. యువగళం (Yuvagalam) పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్న యువ నాయకుడు లోకేష్ యువగళం (Lokesh Yuvagalam) పాదయాత్ర నెల్లూరులో విజయవంతంగా సాగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా.. అనిల్ గార్డెన్స్‌లో ‘మహిళా శక్తితో లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్, లోకేష్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ సంభాషణ ఏంటి..? ఎందుకింతలా వైరల్ అవుతోంది..? అనే ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.

మీరు ప్రభుత్వంలోకి రాగానే..!

సైకాలజిస్ట్ : మన విద్యా వ్యవస్థలో మానసిక సంక్షేమం, శారీరక సంక్షేమం అనే అంశాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. సైకాలజిస్టుగా, తల్లిగా ఈ మాటలు అంటున్నాను. ఇలా జరగడం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం, కుంగుబాటు, బాడీ డిస్మోర్ఫియా వంటి సమస్యల తలెత్తుతాయి. దీంతో చిన్న వయసులోనే పిల్లలు డయాబెటిస్(Diabetes), ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ అంశాలను ఇతర దేశాలు ఓ ముప్పుగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నాయి. చాలా దేశాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ (Physical Education) సబ్జెక్టుకు కూడా ఎడ్యుకేషన్ కర్రిక్యులమ్‌లో స్థానం కల్పించి, ఆ సబ్జెక్టును తప్పనిసరిగా పాస్ అవ్వాలన్న నిబంధన తీసుకువచ్చాయి. టీడీపీ గెలిచి అధికారంలోకి వస్తే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, మన స్కూళ్లలో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఓ తల్లిగా సైకాలజిస్ట్ కోరారు. ఆమె చెప్పిన విషయాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ.. మరోవైపు రాసుకుంటూ లోకేష్ సమాధానం చెప్పారు.

మాటిస్తున్నా తల్లీ..!

నారా లోకేష్ : అవును.. తల్లీ, నేను కూడా బాడీ షేమింగ్ బాధితుడ్నే. శరీరాకృతి పట్ల హేళన ఎదుర్కొంటున్నవారిలో నేను కూడా ఉన్నాను. శాసనసభలో మా నాయకుడు అచ్చెన్నాయుడి గారిని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. దేవుడు అందరినీ ఒకేలా తయారుచేయడు కదా. నేను ఏమనుకుంటానంటే.. కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మొత్తం మార్చేయాలని భావిస్తాను. సామాజిక బాధ్యత, భావోద్వేగ, శారీరకపరమైన బాధ్యత అనేవి లేకుండా పోయాయి. అత్యంత సంతోషకర దేశం ఫిన్లాండ్ నే తీసుకుంటే.. వాళ్లు సమగ్ర విద్యావిధానంపై దృష్టి పెడతారు. వాళ్ల నైతిక విలువల వ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఆ నైతిక విలువలే వారిని కాపాడుతున్నాయి. టీడీపీ కూడా ఈ అంశంపైనే దృష్టి పెడుతుంది. మేం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కేజీ నుంచి పీజీ వరకు కర్రిక్యులమ్‌ను మార్చడంపై చర్యలు తీసుకుంటాం అని లోకేష్ సమాధానం ఇచ్చారు.

ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను టీడీపీ అధికార ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు.. నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు అయితే.. అదంతా పాత లోకేష్ .. ఇప్పుడు లోకేష్ 2.0 అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైసీపీని ప్రస్తావిస్తూ ఆ పార్టీ నేతలకు పనేం లేదుగనుక అసెంబ్లీలోనూ ఇలా సిల్లీగా ప్రవర్తిస్తుంటారు.. అవేం సీరియస్‌గా తీసుకోనక్కర్లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో గురించే చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-07-03T23:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising