YSRCP Survey Leak : వామ్మో.. ఇంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ టికెట్లు ఇవ్వట్లేదా.. నంబర్ ఎంతో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-05-28T16:14:20+05:30
అవును.. ఆంధ్రప్రదేశ్‌లో రేపో మాపో ఎన్నికలు (AP 2024 Elections) అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయ్.. ఇంకా ఏడాది సమయం ఉండగానే నేతల మాటలు పేలుతున్నాయ్.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలకు పదను పెడుతున్నాయ్..
అవును.. ఆంధ్రప్రదేశ్‌లో రేపో మాపో ఎన్నికలు (AP 2024 Elections) అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయ్.. ఇంకా ఏడాది సమయం ఉండగానే నేతల మాటలు పేలుతున్నాయ్.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలకు పదను పెడుతున్నాయ్.. మరోసారి అధికారంలోకి వచ్చి తీరాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YSRCP Chief YS Jagan) ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారి ఎలాగైనా సరే గెలిచి నిలవాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) అంటున్నారు. అధికారంలోకి రావడానికి ఏ చిన్నపాటి చాన్స్ దొరికినా చాలు.. దాన్ని సువార్ణవకాశంగా తీసుకుంటున్నాయ్. సరిగ్గా ఇదే టైమ్‌లో జగన్ రెడ్డి బాంబ్ పేల్చారట. ఇప్పుడున్న 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంతమందికి ‘నో.. టిక్కెట్’ అని తేల్చేశారట. దీంతో ఆ కొంత మంది ఎవరు..? జగన్ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు..? ఏయే విషయాలు బేరీజు చేసుకుని జగన్ ఇలా డిసైడ్ అయ్యారు..? అసలు ఈ జాబితా తయారు చేసిందెవరు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుందాం..
ఇదీ అసలు కథ..!
అవును.. ఏ ఒక్కర్నీ నేను వదులుకోను.. ఇప్పుడున్న సిట్టింగ్‌లు అందరికీ టికెట్లు ఇస్తాను.. అని ఆ మధ్య ఏప్రిల్-3న జరిగిన కీలక సమావేశంలో సీఎం వైఎస్ జగన్ రెడ్డి తెగ చెప్పుకున్నారు. దీంతో అప్పటి వరకూ నరాలు తెగే ఉత్కంఠలో ఉన్న సిట్టింగ్‌లు అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు తాజాగా మరో జాబితా తయారైందట. ఏపీ మొత్తం తిరిగి తిరిగి సర్వేలు చేసిన ఐ ప్యాక్ టీమ్.. (I-PAC Team) కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని, వారికి టికెట్లు ఇస్తే కచ్చితంగా దెబ్బ పడుతుందని చెప్పిందట. ఇప్పుడీ విషయం వైసీపీ వర్గాల్లో (YSRCP), సోషల్ మీడియా (Social Media) వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండివ్వబోతున్నారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇన్నిరోజులు అస్సలు ఆ పరిస్థితే లేదని చెప్పిన జగన్.. ఇంత సడన్‌గా ఇలా ఎందుకు లీక్ చేస్తున్నారు..? వైసీపీలో అసలేం జరుగుతోందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారట.
లెక్కలు ఇలా తీశారా..!?
వాస్తవానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేల పనితీరు, జననాడి ఎలా ఉందనేది ఎప్పుటికప్పుడు జగన్ సర్వేలు చేయించుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఇది జగన్ ప్రత్యేకించి చేయించుకునే సర్వే అయితే.. ఐ ప్యాక్, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వేర్వేరుగా సర్వేలు చేస్తుంటాయ్. ఇలా మూడు సర్వేల (3 Surveys) నివేదికలను ఒకసారి పోల్చి చూడగా.. 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదని తేలిందట. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనకపోవడం, వర్గ విబేధాలు, ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్ అసంతృప్తి ఉండటం, అభివృద్ధికి నోచుకోకపోవడం, గ్రూపు రాజకీయాలు, అవినీతి ఆరోపణలు ఉండటమే సిట్టింగ్‌ల సీట్లు చిరిగిపోవడానికి కారణమట. దీంతో వారందర్నీ పక్కన పెట్టాలని.. ఇందులో ఏ మాత్రం మొహమాటం అక్కర్లేదని జగన్ నిర్ణయం తీసుకున్నారట. అంటే.. ఆ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకమే అన్న మాట. ఇదంతా చాలా సీక్రెట్‌గా సాగినప్పటికీ సర్వే లీక్ కావడంతో వైసీపీ ఎమ్మెల్యేల (YSRP MLAs) గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. గతంలో జరిగిన ‘గడప గడప’కు మొదలుకుని ‘జగనన్న స్టిక్కర్లు’, ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాల వరకూ ప్రజాప్రతిధులంతా జనాల్లో ఉండాలని జగన్ ఇప్పటికే కీలక ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు.. కొందరు పేర్లు చెప్పి మరీ క్లాస్ తీసుకున్నా ఫలితం లేకపోయిందట. ఇక ఫైనల్‌గా తాజాగా చేయించిన సర్వేలో లెక్కలు తేలాయట. అప్పట్లోనే.. ప్రతి ఎమ్మెల్యే కచ్చితంగా జనాల్లో ఉండాల్సిందేనని.. ఏ మాత్రం జన వ్యతిరేకత ఉన్నా టికెట్ ఇవ్వనని.. మంత్రులైతే కేబినెట్ నుంచి తొలగిస్తానని కూడా తేల్చి చెప్పేశారు జగన్.
ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు..!?
నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి తొలగించింది. ఇందులో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉండగా.. రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు. మరికొందరు తన వారసులు, కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు ఎమ్మెల్యేలు వయోభారంతో కూడా పోటీచేయలేమని జగన్ తేల్చి చెప్పేశారట. మరోవైపు.. సుమారు 5 నుంచి 7 మంది సిట్టింగ్ ఎంపీలు.. ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావిస్తున్నారట. మరోవైపు.. రాయలసీమ నుంచి 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. నెల్లూరు నుంచి ముగ్గురు, ఉభయ గోదావరి జిల్లా నుంచి 8 మందిని.. ఉత్తరాంధ్ర నుంచి 9 మందిని పక్కనెట్టాలని ఐ ప్యాక్ టీమ్ క్లియర్‌కట్‌గా జగన్ నివేదిక ఇచ్చిందట. ఇలా మొత్తమ్మీద 30 నుంచి 40 వరకు సిట్టింగ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నో చెప్పేయాలని జగన్‌కు ఐ ప్యాక్ తేల్చిచెప్పేసిందట. అయితే ఇప్పుడు జగన్ ఐ ప్యాక్ చెప్పింది అక్షరాలా పాటిస్తారా..? లేకుంటే ఆ ఎమ్మెల్యేల్లో మార్పు తెస్తారా..? అన్నది ప్రశ్నార్థకమైంది. అయితే.. ఎలాగో ఈ సర్వే లీకైంది కదా.. అధికారికంగా ఏ క్షణమైనా ప్రకటన వచ్చే పరిస్థితులు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. ఐ ప్యాక్ చెప్పాల్సింది చెప్పిందట.. ఇక నిర్ణయం జగన్ చేతిలో ఉందని.. ఆయన నోటి నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగ్‌లు టెన్షన్ పడుతున్నారట. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది గనుక ఈ లోపు మార్పులు, చేర్పులు ఏమైనా చేస్తారా..? లేదా అనేది చూడాలి. అయితే.. ఇప్పటికిప్పుడు ఈ జాబితాను బయటపెట్టినా పరిస్థితులు మారిపోతాయని.. సరైన టైమ్‌లో బహిర్గతం చేయాలని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. జగన్ ప్రకటన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి..? అసలు ఈ సర్వే వ్యవహారంలో నిజానిజాలెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
KCR Vs Modi Govt : కేసీఆర్-కేజ్రీవాల్ భేటీతో ఊహాగానాలకు చెక్ పడినట్లే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!
******************************
BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?
******************************
BRS Vs Congress : నిజంగానే కాంగ్రెస్‌కు 50 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు లేరా.. హరీష్ ఏ లెక్కన చెప్పారు.. అన్నీ సరే గానీ..!
******************************
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత సేఫ్.. ఎక్కడా కనిపించని పేరు.. క్లీన్ చిట్ వచ్చేసినట్లేనా..!?
******************************
Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..
******************************
BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?
******************************
Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..
******************************
TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!
******************************
Updated Date - 2023-05-28T16:22:28+05:30 IST