ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRCP: ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ ఇవ్వకపోవచ్చని టాక్..!

ABN, First Publish Date - 2023-06-24T11:48:21+05:30

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించిన జగన్‌ చేసిన ప్రకటనతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కలవరపాటుకు గురయ్యారు. ఎవరికి వారు ఆ జాబితాలో తాము ఉన్నామేమోనని ఉలికిపడే పరిస్థితి నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్ జాబితాలో ఎవరుంటారో?

పద్దెనిమిది మంది ప్రకటనపై కలకలం

టిక్కెట్‌ ఉండదనే హెచ్చరికతో ఉలికిపాటు

ఆర్కే, రోశయ్యలపై సోషల్‌ మీడియాలో ప్రచారం

గుంటూరు (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది పనితీరు సక్రమంగా లేదు.. మరికొద్ది కాలం గమనిస్తా.. సరిదిద్దుకోకపోతే వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చేది లేదు.. అని రెండు రోజుల క్రితం జరిగిన వర్క్‌షాప్‌లో సీఎం జగన్‌ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. జగన్‌ ప్రకటనతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు కలవరపాటుకు గురయ్యారు. ఎవరికి వారు ఆ జాబితాలో తాము ఉన్నామేమోనని ఉలికిపడే పరిస్థితి నెలకొంది. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్లు ఉన్నట్లు సోషల్‌ మీడియాలో రెండు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. గడపగడపకు కార్యక్రమాన్ని పరిగణలోకి తీసుకునే పక్షంలో ఆళ్ల, ప్రతిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితపై వేటు వేయాల్సి ఉంటుంది. అయితే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని పార్టీ నుంచి సాగనంపడంతో మరో ఎస్సీ నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుచరిత సేఫ్‌ జోన్‌లో పడ్డారు. పైగా తనంతట తానే పార్టీని వీడే అవకాశం ఉందని హెచ్చరిక చేయడంతో ఆమెపై వేటు వేసే బదులు ఓదార్చే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అందువల్లే ఆమె పేరుకు బదులు ఎమ్మెల్యే రోశయ్య పేరు బలంగా వినిపిస్తున్నది.

గత ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయిన చందాన కేవలం వందల ఓట్లతోనే రోశయ్య విజయం సాధించారు. గెలిచిన తర్వాత పనితీరు సక్రమంగా లేదని పార్టీ శ్రేణులే పలుమార్లు రోడ్డెక్కి నిరసించారు. పలుమార్లు సజ్జల వద్దకు వెళ్లి రోశయ్యపై ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అధికారుల నియామకంలో డబ్బులు తీసుకోవడమే కాకుండా, వారి నుంచి నెలవారీ వాటాలు గుంజుతున్నారని బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎంత రచ్చ జరిగినా సరిదిద్దుకోకపోగా ఈ గొడవలకు కారణం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ అని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసి ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించారని కూడా వైసీపీలోని ఓ వర్గం మండిపడుతున్నది. ఆవిర్భావం నుంచి పార్టీ ఉనికిని కాపాడుతూ వచ్చిన రమణను కేవలం కమ్మ సామాజికవర్గం అనే చులకనతో పార్టీ నుంచి సాగనంపారని రమణ వర్గం రగిలిపోతున్నది. ఎమ్మెల్యేని కట్టడి చేయకపోగా నియోజకవర్గంలో పార్టీ రెండు ముక్కలయ్యేలా చేశారని అధిష్ఠానంపై రోశయ్య వ్యతిరేక వర్గం గుర్రుగా ఉంది. ఈ పరిస్థితుల్లో తిరిగి రోశయ్యకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతున్నది.

సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేయాలనే కోరికతో ఉన్నట్టు పార్టీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ సోషల్‌ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే ఆర్కేకు జగన్‌ కొద్దికాలం నుంచే చెక్‌ పెట్టారు. గడప గడపకు కార్యక్రమాన్ని ఆయన బహిష్కరించారు. ఏం చేశామని జనం ముంగిటకు వెళ్లి చెప్పాలని కూడా ఆయన పార్టీ ముఖ్యుల వద్ద ఆగ్రహించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్‌కు ఆర్కేకు మధ్య గ్యాప్‌ ఏర్పడింది. ఆ సమయంలో తన కుమారుడి వివాహానికి కూడా జగన్‌ను పిలవడానికి ఇష్టపడలేదు. ఆర్కేపై కోపంతోనే ఆయన అమెరికాలో ఉన్న సమయంలో చెప్పాపెట్టకుండా మంగళగిరి, తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా వేమారెడ్డిని నియమించారు. ఈ పరిస్థితుల్లో తిరిగి ఆర్కేకు టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరుగుతున్నది.

Updated Date - 2023-06-24T11:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising