ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan : జగన్ రాసిపెట్టుకో.. మీరు ఓడిపోవటం ఖాయం!

ABN, First Publish Date - 2023-10-01T18:36:42+05:30

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Redddy) మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు...

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jagan Redddy) మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వారాహి సభను (Varahi Sabha) నాలుగో విడతను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోవడం ఖాయమని సేనాని వెల్లడించారు.


జగన్.. రాసిపెట్టుకో..!

జనసైనికులకు, తెలుగు తమ్ముళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులు.. మీరు కౌరవులు..100కి పైగా వైసీపీ వాళ్లు సభ్యులుగా ఉన్నారు కాబట్టి కౌరవులే.. కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే. మీరు అధికారం నుంచి దిగడం.. మేం అధికారంలోకి రావడం ఖాయమం. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ అండగా ఉంటాం. 2018 నుంచి ఉద్యోగాలు లేవు. 30వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అధికారం కోసం నేను అర్రులు చాచడం లేదు. మీ భవిష్యత్ కోసం అనుక్షణం ఆలోచిస్తాను. మనకంటే.. మన పార్టీ కంటే.. మన నేల ముఖ్యం. పాదయాత్రలో జగన్ ఇవ్వని హామీలు లేవు.. అధికారంలోకి వచ్చాక అవన్నీ మరిచిపోయారుఅని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ఓటమే టార్గెట్..

ఈ పదేళ్లలో జనసేన చాలా దెబ్బలు తిన్నది. ఆశయాలు, విలువల కోసం పార్టీ నడుపుతున్నాం. వైసీపీని ఓడించడమే జనసేన టార్గెట్. చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు చీలకూడదు అన్నాను. మళ్లీ చెబుతున్నాను.. మీరు (వైసీపీ) ఓడిపోవడం ఖాయం.. మేము అధికారంలోకి రావడం డబుల్‌ ఖాయం.. మెగా డీఎస్సీ వారికి ‌న్యాయం జరగడం ట్రిపుల్‌ ఖాయం. ఉమ్మడి రాష్ట్రానికి అవనిగడ్డ డీఎస్సీ శిక్షణలో ఆయువుపట్టు. 30 వేల పైచిలుకు డీఎస్సీ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. లక్షకోట్లు, కిరాయి సైన్యం, పోలీస్ శాఖ వారి దగ్గర ఉంది..మా దగ్గర ఏముంది ఒక మైక్ తప్ప. మాజీ ప్రభుత్వ ఉద్యోగి‌ కొడుకుగా చెబుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల‌ కష్టాలు తీరుస్తాను. పదేళ్లలో చాలా దెబ్బలు తిన్నాను.. ఓటమి నిస్సహాయంగా ఉంటుంది. ఆశయాలు, విలువల‌కోసం నడిపేవాడ్ని కాబట్టే నిలబడి ఉన్నానుఅని సేనాని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-10-01T18:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising