ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS Party: మహారాష్ట్రలోనూ కల్వకుంట్ల ఫ్యామిలీనేనా?

ABN, First Publish Date - 2023-07-29T10:47:17+05:30

కేసీఆర్ ​కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చాడు. కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావుకు కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణలో కాకుండా మహారాష్ట్రలో ఆయనకు పార్టీ బాధ్యతలను కేసీఆర్ కట్టబెట్టారు. దీంతో మహారాష్ట్రలోనూ కల్వకుంట్ల ఫ్యామిలీనేనా అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో పాగా వేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు మహారాష్ట్రకు విస్తరించబోతుందని కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ (Kalvakuntla Family) రాజ్యమేలుతోంది. ఉద్యమం పేరుతో రాజకీయాలు చేసి అధికారం చేపట్టిన కేసీఆర్ (KCR) నెమ్మదిగా తన ఫ్యామిలీకి పదవులు కట్టబెట్టిన విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం అరడజను మందికి పైగా తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ (KTR), కుమార్తె కవిత (Kavitha), అల్లుడు హరీష్‌రావు (HarishRao), తోడల్లుడు కుమారుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Santosh Kumar) వంటి నేతలు అధికారం చెలాయిస్తున్నారు. కుమారుడికి మంత్రి పదవి, కుమార్తెకు ఎమ్మెల్సీ పదవి, అల్లుడికి మంత్రి పదవి, తోడల్లుడి కుమారుడికి రాజ్యసభ పదవిని కేసీఆర్ పంచిపెట్టారు. ఇప్పుడు కేసీఆర్ ​కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చాడు. కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు(Vamsidhar Rao)కు కూడా బీఆర్ఎస్ (BRS) పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే తెలంగాణలో కాకుండా మహారాష్ట్ర(Maharashtra)లో ఆయనకు పార్టీ బాధ్యతలను కేసీఆర్ కట్టబెట్టారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిగా కల్వకుంట్ల వంశీధర్ రావును నియమించారు. దీంతో మహారాష్ట్రలోనూ కల్వకుంట్ల ఫ్యామిలీనేనా అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో పాగా వేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు మహారాష్ట్రకు విస్తరించబోతుందని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్​ అన్న రంగారావు పెద్ద కొడుకు వంశీధర్​రావు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు తన తండ్రి రంగారావు పేరుతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో సిద్దిపేట టికెట్ ​ఆశించినా అవకాశం రాలేదు. ఆ తర్వాత కేసీఆర్​తోనే ఉంటున్నారు. కొంతకాలంగా ప్రతి కార్యక్రమంలో కేసీఆర్​తో పాల్గొంటున్నారు. మొన్నటివరకు సిద్ధిపేటలో హరీష్‌రావుకు వంశీధర్‌రావు చెక్ పెడతారని ప్రచారం జరిగింది. దీంతో హరీష్‌ను మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయిస్తారని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు వంశీధర్‌రావుకు మహారాష్ట్ర బాధ్యతలను అప్పగించడంతో ఈ వార్తలకు తెర పడింది.


అటు కేసీఆర్ కుటుంబం నుంచి మరికొందరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి కేసీఆర్ అన్న రంగారావు అల్లుడు రేగులపాటి మధుసూదన్​రావు కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. మధుసూదన్ రావు గతంలో కరీంనగర్ జిల్లాకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగారావు మరో కుమారుడు తేజేశ్వర్​రావు అలియాస్ కన్నారావు ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నారు. ఆయన కూడా రాజకీయాలపై కన్నేశారని ప్రచారం జరుగుతోంది. కాగా తెలంగాణ యావత్తు వర్షాలు, వరదలతో ఆగమవుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లని కేసీఆర్.. పార్టీ సభ కోసం మాత్రం మహారాష్ట్రకు వెళ్తున్నారని పలువురు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

T-Congress: బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కీలక నేత.. పదవి తీసుకొని పనిచేయమని కోరిన సీఎం కేసీఆర్

**************************************************************

TS Politics : ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. 42 మంది నేతల రాజీనామా..!

Updated Date - 2023-07-29T10:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising