ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికలకు ఈ ఇద్దరూ స్టార్ క్యాంపెయినర్లా.. దానికో లెక్కుంది..!

ABN, First Publish Date - 2023-04-20T18:44:24+05:30

ఆ ఇద్దరు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే జిల్లాకు చెందిన వాళ్లు మాత్రమే కాదు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూడా. కానీ.. ఎక్కడ చెడిందో తెలియదు గానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ఇద్దరు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే జిల్లాకు చెందిన వాళ్లు మాత్రమే కాదు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూడా. కానీ.. ఎక్కడ చెడిందో తెలియదు గానీ బద్ధ శత్రువులుగా మారారు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయిలో ఈ ఇద్దరి వైరం ఉండేది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల.. ఆ ఇద్దరిలో ఒకరికి జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం దక్కితే, మరొకరిని మరో జాతీయ పార్టీకి జాతీయ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసే అవకాశం వరించింది. ఇప్పుడు ఇద్దరి దారులు వేరు. ఉప్పూనిప్పులా ఉండే వారిద్దరినీ ఆ రెండు జాతీయ పార్టీలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చాయి. దీంతో.. ఈ ఇద్దరు నేతలు పొరుగు రాష్ట్ర రాజకీయ పోరులో భాగం కాబోతున్నారు. ఇంతకీ ఎవరీ ఇద్దరు రాజకీయ నేతలు? స్టార్ క్యాంపెయినర్లుగా ఇద్దరినీ పరిగణనలోకి తీసుకునేందుకు దారితీసిన పరిస్థితులేంటి ?

ఇప్పటివరకూ మనం చెప్పుకున్న ఆ ఇద్దరు నేతలు మరెవరో కాదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి (T PCC President Revanth Reddy), డీకే అరుణ (BJP Leader DK Aruna). ఈ ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఏ స్థాయిలో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్న వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రేవంత్, డీకే అరుణ ఒకరినొకరు దూషించుకున్న తీరును చూసిన వారంతా ఈ ఇద్దరికీ రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఏమైనా పగలు, ప్రతీకారాలు ఉన్నాయేమోనన్న అనుమానం కలిగించేలా ఇద్దరి తీరు ఉండేది. అలాంటి ఈ ఇద్దరు రెబల్ నేతలు ఒకరు కాంగ్రెస్‌లో, మరొకరు బీజేపీలో కొనసాగుతున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి, బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలిగా డీకే అరుణ కీలక పదవుల్లో ఉన్నారు. దూకుడుగా వ్యవహరిస్తారనే పేరున్న ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్, బీజేపీ కర్ణాటక ఎన్నికల బరిలో ప్రచారానికి వినియోగించుకోవాలని డిసైడ్ కావడం విశేషం.

స్టార్ క్యాంపెయినర్లుగా కాంగ్రెస్, బీజేపీ ఈ ఇద్దరికీ అవకాశం కల్పించడానికి ఈ ఇద్దరు నేతల రెబల్ రాజకీయంతో పాటు మరో ప్రధాన కారణం కూడా ఉంది. కర్ణాటకలోని రాజకీయంగా నేతల భవితవ్యం తారుమారు చేసే ముఖ్య జిల్లాల్లో ‘రాయచూర్’ కీలకం. డీకే అరుణ సొంత నియోజకవర్గమైన గద్వాల్‌కు 50 కిలోమీటర్లు, రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు 140 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ జిల్లా కేంద్రం ఉంది. గుల్బర్గా అయితే వంద కిలో మీటర్ల లోపే కావడం గమనార్హం.

సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఈ రెండు జిల్లాల్లో తెలుగు వాళ్లు ఎక్కువగానే స్థిరపడ్డారు. తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే తెలుగు నేతలతోనే పనవుతుందని రెండు జాతీయ పార్టీలు భావించాయి. అలా అని సరిహద్దులతో సంబంధం లేని నేతలను తీసుకొచ్చినా పనవదని భావించి.. నేతల కోసం కాంగ్రెస్, బీజేపీ అన్వేషించిన తరుణంలో డీకే అరుణ, రేవంత్ రెడ్డి తారసపడ్డారు.

కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన కొడంగల్, గద్వాల్‌కు చెందిన నేతలతో సమీప కన్నడ ప్రాంతాల్లో ప్రచారం చేయిస్తే మేలు జరుగుతుందనే వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి, డీకే అరుణను ఇరు పార్టీలు రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యాయి. రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ చేర్చడాన్ని కర్ణాటక బీజేపీ ట్విటర్ వేదికగా తప్పుబట్టింది. ‘ఓటుకు నోటు’ కేసులో నిందితుడైన రేవంత్ ‘కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినరట’ అని కర్ణాటక బీజేపీ ఎద్దేవా చేసింది. ట్విటర్‌లో యమా యాక్టివ్‌గా ఉన్న కర్ణాటక బీజేపీ, కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల ఒక్కొక్కరి పేరును ప్రస్తావిస్తూ తూర్పారబడుతుండటం గమనార్హం.

Updated Date - 2023-04-20T18:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising