ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: మీ పెళ్లి బాధ్యత మాదే.. యువకులకు అభ్యర్థుల బంపరాఫర్!

ABN, First Publish Date - 2023-05-04T20:58:19+05:30

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు అలవిగాని హామీలు ఇవ్వడం సర్వసాధారణమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు అలవిగాని హామీలు ఇవ్వడం సర్వసాధారణమైన విషయమే. తమకు అధికారం కట్టబెడితే ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించేస్తామని హామీల వర్షం కురిపిస్తుంటారు. అయితే, మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చిన హామీలు వైరల్ అవుతున్నాయి. బెళగావి జిల్లా అరబావి, గోకాక్‌ నియోజకవర్గాల స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

అరబావి అభ్యర్థి గురుపుత్ర కెంపణ్ణ కుళ్లూర, గోకాక్‌ అభ్యర్థి పుండలీక కుళ్లూర.. ఇద్దరూ యువకులందరికీ పెళ్లిళ్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. వీరిద్దరూ అన్నదమ్ములు. తమను గెలిపిస్తే యువకులకు పెళ్లిళ్లు చేయిస్తామని కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు. ‘యువతులు దొరకక వివాహాలు కావడం లేదనే చింతను వీడండి. మమ్ములను గెలిపిస్తే రెండు నియోజకవర్గాల పరిధిలోను పెళ్లికాని యువకులందరికీ వివాహాలు జరిపించే పూచీ మాదే’ అని ప్రచారం చేస్తున్నారు. వీరి కరపత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రెండుచోట్లా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అరబావి నుంచి బాలచంద్ర జార్కిహోళి, గోకాక్‌ నుంచి రమేష్‌ జార్కిహోళి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు.

Updated Date - 2023-05-04T20:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising