ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

DK Shivakumar or Siddaramaiah: కర్ణాటక ఎపిసోడ్‌లో కీలక మలుపు.. వందమందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉందంటే..

ABN, First Publish Date - 2023-05-16T16:50:46+05:30

కర్ణాటకలో కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్న సమయంలో సారథ్యం వహించిన డీకే శివకుమార్‌ ఒకవైపు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలను ఏకతాటి వైపు నడిపే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటకలో కాంగ్రెస్‌ (Karnataka Congress) కష్టకాలంలో ఉన్న సమయంలో సారథ్యం వహించిన డీకే శివకుమార్‌ (DK Shivakumar) ఒకవైపు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలను ఏకతాటి వైపు నడిపే సిద్దరామయ్య మరోవైపు, ఇద్దరూ హేమాహేమీలే. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) కలసి అడుగులు వేశారు. శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలో కలసికట్టుగానే చేతులు కలిపి చిరునవ్వులు చిందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్పష్టమైన భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తూనే ముఖ్యమంత్రి కుర్చీ కోసం కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. సీఎం పదవిని చేజిక్కించుకునేందుకు ఇద్దరు నేతలు ఎత్తుకు పై ఎత్తుతో తమ రాజకీయ అస్త్రాలకు పదును పెడుతున్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య మధ్య సీఎం కుర్చీకోసం సాగుతున్న తీవ్ర పోరుతో అడకత్తెరలో పోక చందాన కాంగ్రెస్‌ అధిష్టానం పరిస్థితి ఇరకాటంలో పడింది. నూతన సీఎంను ఎంపిక చేసే అధికారాన్ని ఎమ్మెల్యేలందరూ అధిష్టానానికి అప్పగించడంతో మొత్తం సీన్‌ ఢిల్లీకి మారినా సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న నేతల మధ్య సయోధ్య కుదర్చడం అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది.

సిద్దూకు వంద మంది ఎమ్మెల్యేల మద్దతు

ముఖ్యమంత్రి ఎంపిక కోసం కాంగ్రెస్‌ అధిష్టానం నియమించిన మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్‌ షిండే నాయకత్వంలోని ముగ్గురు అధిష్టానం పరిశీలకులు బెంగళూరులో ఆదివారం రాత్రంతా జోరుగానే కసరత్తు చేశారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించారు. ఢిల్లీకి వెళ్లిన ఈ బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం రాత్రి తుది నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో వంద మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్దరామయ్య నాయకత్వానికే మద్దతు చూపినట్టు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుస్తూనే కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు. సిద్దరామయ్య తన అనుచరగణంతో మధ్యాహ్నమే ఢిల్లీకి వెళ్లినా డీకే శివకుమార్‌ మాత్రం బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలోనే ఉండిపోయారు. ఆశ్చర్యకరంగా తన నివాసంలో ఉదయం జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి సిద్దరామయ్యకు తినిపించడం, నేతలందరూ హాజరు కావడం తెలిసిందే. అయితే ఉదయం కనిపించిన ఐక్యతా రాగం ఆపై అదృశ్యం కావడం గమనార్హం.

నిజానికి కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ప్రతిపక్షనేత సిద్దరామయ్య హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయం నుంచి కలసికట్టుగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చివరి క్షణంలో డీకే వెళ్లలేదు. అనంతరం డీకే శివకుమార్‌ మీడియాతో ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని పరోక్షంగా సీఎం పదవి తనకే దక్కాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్టు ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లవచ్చునని భావించినా హఠాత్తుగా కడుపునొప్పి కారణంగా ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. తద్వారా అధిష్టానానికి పరోక్షంగా తన సంకేతాన్ని ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికి డీకే శివకుమార్‌ ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో.. కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్‌తో, సిద్ధరామయ్యతో మాట్లాడి ఈ సస్పెన్స్‌కు తెర దించాలని డిసైడ్ అయింది.

సిద్ధమవుతున్న రాజీ ఫార్ములా

ముఖ్యమంత్రి పదవి వ్యవహారం క్లిష్టంగా మారడంతో అధిష్టానం ఓ రాజీ ఫార్ములాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం డీకే శివకుమార్‌, సిద్దరామయ్య చెరో రెండున్నర సంవత్సరాలు కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఎవరు ముఖ్యమంత్రి కావాలనే అంశంలో ఏకాభిప్రాయం కుదిరితే తప్ప అమలు సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిద్దరామయ్యకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న విషయం తెలుస్తూనే బెంగళూరులో డీకే శివకుమార్‌ తన శక్తి ఏంటో తనకు తెలుసనని చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో పెద్దలు తీసుకునే నిర్ణయం అత్యంత కీలకం కానుంది.

Updated Date - 2023-05-16T16:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising