కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

National Film Awards : నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు కేసీఆర్ స్పెషల్ విషెస్.. అంతేనా..!?

ABN, First Publish Date - 2023-08-26T21:15:56+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (69th National Film Awards) ఉత్తమ నటుడి (Best Actor)గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే...

National Film Awards : నేషనల్ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్‌కు కేసీఆర్ స్పెషల్ విషెస్.. అంతేనా..!?

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో (69th National Film Awards) ఉత్తమ నటుడి (Best Actor)గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి నటుడిగా ఈ అవార్డుతో ఐకాన్ స్టార్ చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘పుష్ప’ (Pushpa) సినిమాలో నటనకిగానూ బన్నీ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా.. అవార్డు దక్కించుకున్న వారిపై తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రశంసలు కురిపించారు. జాతీయ ఉత్తమ నటుడిగా తొలిసారిగా తెలుగు నటుడు అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు.. తెలుగు చలన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కడం పట్ల కూడా గులాబీ బాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎంవో ఓ ప్రకటన రిలీజ్ చేసింది.


Bunny-pic.jpg

గొప్ప విషయం..!

విలక్షణమైన రీతిలో తమ అత్యుత్తమ నటనద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయం. కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణం. నాటితరం గొప్ప నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి వంటి వారి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పది అని కేసీఆర్ ప్రకటనలో పేర్కొన్నారు.

గర్వకారణం..!

అదే సందర్భంలో... తమ సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు, ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి నా అభినందనలు. తెలుగు చలన చిత్ర రంగం నేడు హైద్రాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్‌లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వ కారణం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలుగు సినిమా ఇతర భారతీయ సినిమా రంగాలతో పోటీపడుతుండటం సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి కొనసాగిస్తూనే వుంటుంది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలిఅని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

పట్టించుకోండి సారూ..?

కేసీఆర్ అభినందలతోనే సరిపెడతారా..? లేకుంటే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సత్కరించడం లాంటివి చేయరా..? అని నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఎలాగో సీఎం వైఎస్ జగన్ రెడ్డి పట్టించుకోలేదు.. తమరైనా అవార్డు వచ్చిన వారిని పట్టించుకోవాలని.. ఇండస్ట్రీని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయం కాబట్టి కచ్చితంగా అలాంటిది ఏదో కేసీఆర్ ప్లాన్ చేసే ఉంటారనే ప్రచారం కూడా బలంగా నడుస్తోంది. అవార్డు అందుకున్న తర్వాత పెద్ద ప్రోగ్రామే ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు సమాచారం. ఫైనల్‌గా కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


TS Assembly Polls : ఎన్నికల ముందు ఈ పరిణామాలు దేనికి సంకేతం.. కేసీఆర్ మారిపోయారా.. భయపడ్డారా..!?


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


TS Assembly Polls : కాంగ్రెస్ ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు.. ఆ రెండు నియోజకవర్గాలకు ఒక్కటి మాత్రమే.. ఎన్నారైల క్యూ..


TTD Board Members : 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటన.. ప్చ్ ఈయనకు ఎందుకిచ్చారో..!?



Updated Date - 2023-08-26T21:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising