ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest : 10 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే చంద్రబాబు.. నివ్వెరపోయిన ఎన్‌ఎస్‌జీ

ABN, First Publish Date - 2023-09-20T13:05:10+05:30

. అత్యంత ఎన్‌ఎస్‌జీ కమాండోల భద్రత మధ్య ఉండే ఆయన గత పది రోజులుగా కేవలం సెంట్రల్‌ జైలు సిబ్బంది భద్రతలోనే ఉన్నారు.. అదే జైలులో 1800 మంది వరకూ కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు..

  • ఆది నుంచి భద్రతపై తీవ్ర ఆందోళన

  • నేటికీ జైలు సిబ్బందితోనే రక్షణ

  • సెంట్రల్‌ జైలులో 1800 మంది ఖైదీలు

  • భయపడుతున్న పార్టీ శ్రేణులు, ప్రజలు

  • ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించాలని డిమాండు

ఒక్క క్షణం తీరికలేకుండా జనం మధ్య ఉండే చంద్రబాబు జైలులో ఎలా ఉంటున్నారో.. ఎవరి నోట విన్నా ఇదేమాట.. ఎందుకంటే చంద్రబాబు సెంట్రల్‌ జైలులో పది రోజులుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.. అరకొర సౌకర్యాల మధ్య కాలం గడుపుతున్నారు.. మరో పక్క కుటుంబీకులు, అభిమానులు, ప్రజలు.. చంద్రబాబు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అత్యంత ఎన్‌ఎస్‌జీ కమాండోల భద్రత మధ్య ఉండే ఆయన గత పది రోజులుగా కేవలం సెంట్రల్‌ జైలు సిబ్బంది భద్రతలోనే ఉన్నారు.. అదే జైలులో 1800 మంది వరకూ కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు.. ఈ నేపథ్యంలో జైలులోనూ చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించాలని పలువురు డిమాండు చేస్తున్నారు..


రాజమహేంద్రవరం : తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే బాబు సతీమణి భవనేశ్వరి, కుమారుడు లోకే శ్‌ చంద్రబాబు భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కారణం లేకపోలేదు. సరిగ్గా ఆదివారం(10న) రాత్రి 1.25 గంటల వరకూ దేశంలోనే అత్యున్నత భద్రత సిబ్బంది (ఎన్‌ఎస్‌జీ) రక్షణ వలయంలో చంద్ర బాబు ఉన్నారు. తర్వాత నిమిషం నుంచి సెంట్రల్‌ జైలు సిబ్బంది చేతిలోకి ఆయన భద్రత వెళ్లింది. జైలు సిబ్బందికి ప్రాణరక్షణలో తర్ఫీదు ఉండదు. చేతిలో ఆయుధాలూ ఉండవు. కోస్తాంధ్ర ప్రాంత డీఐజీ జైలు లో రాత్రివేళ ఆకస్మిక తనిఖీలు చేసిన సమయంలో పలు భద్రత లోపాలను గుర్తించారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు భద్రతపై తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆయన భద్రతపై భరోసా కలిగించేవిధంగా ఇప్పటికీ ఎలాంటి చర్యలూ లేకపో వడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి అద్దంపడుతోం ది. చంద్రబాబుకు జైలులో రక్షణపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కల్పించుకోవాలనే డిమాండ్లు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు క్షీణించడం, వైసీపీ గూండా గిరీ.. చట్టాలపై లెక్కలేనితనం గమనిస్తున్న జనం చంద్రబాబు రక్షణపై భయం వ్యక్తం చేయడం సబబనే వాదనలూ ఉన్నాయి. ఇదిలా ఉండగా గత పది రోజు లుగా చంద్రబాబునాయుడు సెంట్రల్‌ జైలులో అరకొర సౌకర్యాల మధ్య రిమాండ్‌ ఖైదీగా ఉంటున్నారు.

జైలు సిబ్బందితో భద్రత..

సెంట్రల్‌ జైలులో ప్రస్తుతం సుమారు 1800 మంది ఖైదీలు ఉన్నారు. జైలులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కేవలం 400 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారు. ఖైదీల్లో కరడుగట్టిన నేరస్తులు ఉన్నారు. ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్న వ్యక్తికి షిఫ్టుల వారీగా చేతిలో కర్రలతో 10-15 మందిని కాపలాగా ఉంచుతున్నారు. ఆయనకు కేటాయించిన స్నేహ బ్లాక్‌ పెద్ద రెండంతస్తుల భవనం. దీనిలో దాదాపు 30 పెద్ద గదులు ఉంటాయి. గదులు ఖాళీగా ఉంటే ఈ బ్లాక్‌ భయానకమే. వీటిలో ఒక గదిని చంద్రబాబుకు కేటా యించారంటే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది.

ఆందోళన ఇందుకే..

వైసీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబును టార్గెట్‌ చేసింది. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కనీసం భద్రత కల్పించకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆయన రక్షణపై సాక్షాత్తూ ఎన్‌ఎస్‌జీ ఆందోళన వ్యక్తం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వ తీరును అర్థం చేసుకోవచ్చు. గతంలో అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, ఆయనను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగొచ్చని కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్నప్పటికీ చంద్ర బాబుపై వైసీపీ గూండాల దాడులు ఎక్కువయ్యాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర హోంశాఖ చంద్రబాబుకు భద్రత పెంచిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుకు అప్పటి వరకూ 6+6(12) కమెండోలతో భద్రత ఉండేది. దానిని రెట్టింపు అంటే 12+12(24) చేస్తూ 2022 ఆగస్టు 26న ఉత్తర్వులిచ్చిం ది. ఇటు వైసీపీ ప్రభుత్వం బాబుకు రక్షణగా ఉన్న పోలీసులను తగ్గించేసింది. హైకోర్టును ఆశ్రయించడం తో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

నివ్వెరపోయిన ఎన్‌ఎస్‌జీ

అత్యున్నత భద్రత నడుమ వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో ఎన్‌ఎస్‌జీ నివ్వెరపోయింది. ఈ ఏప్రిల్‌లో కుప్పంలో చంద్రబాబుతోపాటు ఏకంగా ఎన్‌ ఎస్‌జీ అధికారిపై కూడా వైసీపీ గూండాలు దాడి చేశారు. గతంలో ఆయన అమరావతికి బస్సులో వెళ్తుం డగా రాళ్లతో దాడి జరిగింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వం సం సృష్టించారు. చంద్రబాబు బయటకు రాకుండా గేట్లను తాళ్లతో కట్టేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఈ ఫిబ్రవరిలో జరిగిన ఘటనపై ఎన్‌ఎస్‌జీ ఆగ్ర హం వ్యక్తంచేసింది. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమ కార్యాలయానికి నివేదించింది.

ఎన్‌ఎస్‌జీని అనుమతించొచ్చుగా..

ఏకంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న నాయకుడు. సుదీ ర్ఘ రాజకీయ చరిత్ర ఆయన సొంతం. అలాంటి వ్యక్తి భద్రతపై అన్ని వైపుల నుంచీ ఆందోళన వ్యక్తమవు తున్నా జైళ్ల శాఖకు మాత్రం నిబంధనలు గుర్తొస్తున్నా యి. మాజీ ముఖ్యమంత్రి ప్రాణాల కంటే నిబంధనలే ముఖ్యమంటూ ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకు న్నట్టు అధికారులు మాట్లాడుతున్నారు. పైగా సెంట్రల్‌ జైలులో ఏమి జరిగినా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. అధికారులు ఏది చెబితే అదే నిజమని నమ్మాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు ఇప్ప టికే చంద్రబాబుకు హాని ఉందని జారీచేసిన హెచ్చ రికలు ఉన్నాయి. పైగా రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కక్ష గురించి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు జైలు లో రక్షణకు ఎన్‌ఎస్‌జీ కమెండోల భద్రత కల్పించాల ని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విష యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే కల్పించుకోవాలని కోరుతున్నాయి. చంద్రబాబు జైలులోకి వెళ్లిన తర్వాతి నుంచీ ఎన్‌ఎస్‌జీ కమెండోలు రాజమహేంద్రవరంలో నే ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి 21 మంది పోలీ సులను జైలులోని భద్రతకు పంపించగా వాళ్లకు చంద్రబాబు పరిసరాల్లో డ్యూటీలు వేయడం లేదు. వాచ్‌టవర్లపై వాళ్లకు విధులు కేటాయించారు.

ఎన్‌ఎస్‌జీ ఎందుకు?

ఎన్‌ఎస్‌జీ పూర్తిగా కేంద్ర హోం శాఖ నియం త్రణలో ఉంటుంది. కమెండోలను బ్లాక్‌ క్యాట్‌ కమెం డోలు అని అంటారు. వీళ్లకు శిక్షణ అత్యంత కఠినంగా ఉంటుంది. ఏ వ్యక్తి రక్షణకు వీరిని కేటాయించారో వారి భద్రత పూర్తిగా బాధ్యత వహిస్తారు. ఎలాంటి ఎటాక్‌ నుంచైనా ఆ వ్యక్తిని కాపాడడానికి ప్రతి క్షణం సన్నద్ధులై ఉంటారు. చంద్రబాబుకు హాని దృష్ట్యా అంతటి సుశిక్షితులైన కమెండోల రక్షణను కేంద్రం కల్పించింది. కొన్నేళ్లుగా ఆయనను కంటికి రెప్పకంటే ఎక్కువగా కమెండోలు కాపలా కాశారు.

ఎవరు ఎలాంటి వారో..

కమెండోల రక్షణలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎవరి కీ ఆయన భద్రతపై అనుమానాలు రేకెత్తలేదు. అయి తే సెంట్రల్‌ జైలులో ఖైదీలకు కాపలాగా ఉండే వాళ్లను చంద్రబాబు భద్రతకు వినియోగిస్తున్నారు. చంద్రబా బుకు భద్రతగా పెట్టిన వాళ్లలో ఎవరు ఏ పార్టీకి చెం దిన సానుభూతిపరులో చెప్పడం కష్టం. వాళ్లను సుదీ ర్ఘంగా చూసిన వ్యక్తులైతే అంచనా వేస్తారు. సెంట్రల్‌ జైలులో రాజారావు సూపరింటెండెంట్‌ సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. ఆయనకు ఎవరు ఎలాంటి వారో చాలామటుకు తెలుసు. తర్వాత రాహుల్‌ వచ్చి నాలుగు నెలలే అయ్యింది. ఈ కొద్దీ సమయంలో విధు ల్లో కుదురుకోవడం కూడా కష్టమే. అదీగాకుండా భార్య అకాల మృత్యువు పాలవడంతో ఆయన సెలవుపై ఉన్న విషయం తెలిసిందే. దీంతో డీఐజీ రవికిరణ్‌ జైలును పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు నెల్లూరు, గుం టూరు, కడపల్లో పర్యవేక్షణా బాధ్యతలు చూసిన అను భవం ఉన్నా.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అనుభవం లేదు. ఇక్కడి సిబ్బంది అందరూ ఆయనకు కొత్తవారే. ఎన్‌ఎస్‌జీ విషయంలో ఇలాంటి అనుమానా లకు తావుండదు.చంద్రబాబు భద్రత ఒకటే వారి విధి.

జైలులో అరకొర సౌకర్యాలే

చంద్రబాబు సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా గత పది రోజులుగా అరకొర సౌకర్యాల మధ్యనే ఉన్నారు. ఆయన స్నేహ బ్లాక్‌లో ఉన్నారు. ఈ బ్లాకును అంతకుముందు మానసిక రుగ్మతలతో బాధపడే ఖైదీలకు వినియోగించేవారు. ప్రస్తుతం ఆ బ్లాక్‌లో ఒక గదిని చంద్రబాబుకు కేటాయించారు. ఆ భవనంలో ప్రస్తుతం ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయన ఉన్న రూమ్‌కు ఒక్క ఫ్యాన్‌ మాత్రమే ఇచ్చారు. ఒక మంచం.. ఒక కుర్చీ మాత్రమే ఉన్న ట్టు సమాచారం. తర్వాత ఏసీ గురించి డిమాండు చేయగా ఓ కూలర్‌ ఇచ్చినట్టు సమాచారం. 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు కూలర్‌ సౌండ్‌ వల్ల, అతి గాలి వల్ల ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. ఎండలు ఎక్కుగా ఉండడం ఉక్కబోతతో సతమత మవుతున్నట్టు సమాచారం. స్నేహ బ్లాక్‌ చుట్టూ చెట్లు ఉండడంతో దోమలు విజృంభిస్తున్నట్టు తెలిసింది. సుమారు 14 ఏళ్లపాటు సీఎం పనిచేసిన చంద్రబాబు ఇలా అరకొర సౌకర్యాల మధ్య గడుపు తుండడం పార్టీ శ్రేణులను ఆవేదన గురిచేస్తోంది.

Updated Date - 2023-09-20T13:05:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising