Karnataka Polls: అప్పుడేమో రాముడిని.. ఇప్పుడు హనుమంతుడి వంతు: కాంగ్రెస్‌పై మోదీ ఫైర్
ABN, First Publish Date - 2023-05-02T21:45:14+05:30
కాంగ్రెస్ పార్టీ (Congress Party) తన ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్(Bajrang Dal)ను
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ (Congress Party) తన ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్(Bajrang Dal)ను నిషేధిస్తామని ఇచ్చిన హామీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఒకప్పుడు రాముడిని బంధించిందని, ఇప్పుడు హనుమంతుడిని కూడా బంధించాలని చూస్తోందని మండిపడ్డారు.
విజయనగర జిల్లాలోని హొస్పేటలో మంగళవారం ఆయన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు కాలం చెల్లిందని అన్నారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్న శక్తులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నామని తెలిపారు. ఇందులో కులమతాల ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులను బుజ్జగించిన చరిత్ర కాంగ్రెస్‌కే చెల్లుతుందని మోదీ విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-05-02T21:45:14+05:30 IST