ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan Biopic: వెండితెరపైకి వైఎస్ జగన్ బయోపిక్.. జగన్ క్యారెక్టర్‌కు ఎవరిని అనుకుంటున్నారంటే..

ABN, First Publish Date - 2023-05-05T19:48:17+05:30

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలను, రాజకీయాలను వేరువేరుగా చూడలేం. సినీ రంగంలో ఓ వెలుగు వెలుగొందిన ధృవ తార నందమూరి తారక రామారావు సీఎం పీఠాన్ని అధిష్టించిన చరిత్ర మన తెలుగు ప్రజల సొంతం. ఎన్టీఆర్‌ను రాజకీయంగా విమర్శిస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల్లో సినిమాలను, రాజకీయాలను వేరువేరుగా చూడలేం. సినీ రంగంలో ఓ వెలుగు వెలుగొందిన ధృవ తార నందమూరి తారక రామారావు సీఎం పీఠాన్ని అధిష్టించిన చరిత్ర మన తెలుగు ప్రజల సొంతం. ఎన్టీఆర్‌ను రాజకీయంగా విమర్శిస్తూ సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు తీసిన విషయం కూడా తెలిసిందే. అప్పుడు ఆ ట్రెండ్ నడిస్తే.. ఇప్పుడు రాజకీయ నాయకుల బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తెలుగులో ‘రక్త చరిత్ర’ సినిమాతో మొదలైన ఈ బయోపిక్‌ల ట్రెండ్‌కు రాంగోపాల్ వర్మ శ్రీకారం చుట్టాడని చెప్పక తప్పదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘వంగవీటి’, ‘కొండా’ సినిమాలతో వర్మ వరుస బయోపిక్‌లను తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలాడు.

అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం బయోపిక్‌లకు శ్రీకారం చుట్టి విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ముందు ప్రజల్లోకి వైఎస్ ముద్రను బలంగా తీసుకెళ్లేందుకు విడుదలైన సినిమా ‘యాత్ర’. ఎన్నికలే టార్గెట్‌గా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలు కూడా విడుదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటర్లే టార్గెట్‌గా మరోమారు థియేటర్లలో బయోపిక్‌లు సందడి చేయనున్నాయి. వైసీపీ అధినేత జగన్ బయోపిక్‌ 2024 ఎన్నికల లోపు విడుదల కానున్నట్లు తెలిసింది. ‘యాత్ర’ సినిమాకు కొనసాగింపుగా జగన్ బయోపిక్ రానుంది. ‘యాత్ర2’ పేరుతో తెరకెక్కనున్న జగన్ బయోపిక్‌కు వైఎస్‌ఆర్ బయోపిక్ తీసిన మహీ వి రాఘవే దర్శకుడు. అయితే.. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మొదట జగన్ పాత్రకు సూర్యను అనుకున్నప్పటికీ కారణాలేంటో తెలియదు గానీ సూర్య ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని తేలిపోయింది. దీంతో.. జగన్ పాత్రకు తగిన వ్యక్తి కోసం వెతుకులాట సాగించగా తమిళ నటుడు, ‘రంగం’ ఫేం జీవా తారసపడినట్లు తెలిసింది. వచ్చే నెలలో జీవాకు లుక్ టెస్ట్ చేసి జగన్ పాత్రకు తగిన నటుడో.. కాదో.. దర్శకుడు తేల్చేయనున్నట్లు సమాచారం.

జీవా అయితే జగన్ పాత్రకు న్యాయం చేస్తాడని దర్శకుడు మహీ వి రాఘవ బలంగా నమ్ముతున్నాడట. ప్రస్తుతం మహి వి రాఘవ ‘Save The Tigers’ పార్ట్-2 వెబ్ సిరీస్ చేస్తున్నాడు. జగన్ బయోపిక్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ జులై నుంచి మొదలవనున్నట్లు తెలిసింది. ‘యాత్ర2’ సినిమాలో ఎక్కువగా జగన్ పాదయాత్రను హైలైట్ చేయనున్నారు. పాదయాత్ర నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరకూ మాత్రమే సినిమాలో ఉంటుందా లేక వైసీపీ పాలనను కూడా బయోపిక్‌లో చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ‘వ్యూహం’ పేరుతో టీడీపీకి రాజకీయంగా నష్టం చేయడమే లక్ష్యంగా, వైసీపీకి పూర్తి అనుకూలంగా వర్మ ఓ ప్రాజెక్టును భుజానికెత్తుకుని వైసీపీ కనుసన్నల్లో ముందుకెళుతున్నారు.

Updated Date - 2023-05-05T19:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising