TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!
ABN, First Publish Date - 2023-02-18T22:20:22+05:30
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో...
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, నందమూరి, నారా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు వారాల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuva Galam) పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు (Heart Attack) వచ్చింది. దీంతో ప్రాథమిక చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత కుప్పంలోని ప్రముఖ పీఈఎస్‌కు (PES) తరలించారు. ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో అర్ధరాత్రి కుప్పం (Kuppam) నుంచి బెంగళూరులోని (Bangalore) నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రికి తరలించారు. వైద్య నిపుణులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించినా ట్రీట్మెంట్‌కు తారకరత్న శరీరం సహకరించలేదు. 23 రోజులుగా బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే.. ఈ మధ్య రాజకీయాల్లోకి (Politics) రావాలని ఆ మధ్య చాలా ప్రాంతాల్లో తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి తిరిగారు. అంతేకాదు.. ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీచేయాలని తారకరత్న భావించినట్లు తెలియవచ్చింది. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేయాలనుకున్నారు..? ఈ విషయం ఎవరెవరికి చెప్పారు..? వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నియోజకవర్గం ఇదేనా..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గమైన గుడివాడ (Gudivada) నుంచి తారకరత్న పోటీచేయాలని గట్టి ప్రయత్నాలే చేశారని టాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌కు కూడా చెప్పినట్లు సమాచారం. వారిద్దరి నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి ఒకప్పుడు గుడివాడ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట.. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) అడ్డాగా మారిపోయింది. చీటికి మాటికి టీడీపీపై నోరుపారేసుకునే నానిపై నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) నుంచి ఒకర్ని బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం గట్టి ప్లాన్‌తోనే ఉందని తెలియవచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో తారకరత్న కూడా రాజకీయాల్లోకి వస్తాననడం.. పోటీ కూడా చేస్తాననడంతో గుడివాడ నుంచే బరిలోకి దింపాలని ప్లాన్ చేసిందట అధిష్టానం. ఒకవేళ తారకరత్నే గుడివాడ నుంచి పోటీచేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో.. ఏమో..!
ఆ మధ్య వరుస భేటీలు..!
ఆ మధ్య లోకేష్‌తో తారకరత్న భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో ఈ ఇద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నప్పటికీ రాజకీయ పరిణామాలతో పాటు కుటుంబ విషయాలు.. పోటీచేసే స్థానంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు అప్పట్లో నెట్టింట్లో పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తోడు తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న ఓ సందర్భంలో చెప్పడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది. తారకరత్న టీడీపీ తరపున గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ అనుభవం కూడా ఎన్నికల్లో పోటీచేయడానికి పనికొస్తుందని టీడీపీ అభిమానులు అప్పట్లో భావించారు కూడా.
పొలిటికల్ కామెంట్స్ ఇవీ..
అప్పట్లో ఎన్నికల్లో పోటీ, వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలే చేశారు తారకరత్న. ‘ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రస్తుతం ఏపీ సంక్షోభంలో ఉంది. దాని నుంచి బయటపడాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యం అవుతుంది. ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రత్యక్షంగా రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమయ్యాను. నా అడుగు ప్రజల వైపు... నా చూపు రాష్ట్రాభివృద్ధి. అదే లక్ష్యంతో పనిచేస్తా. సుపరిపాలన అందించే నాయకుడు చంద్రబాబు. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి అండగా ఉండాలి. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు నేను ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. బాలయ్య బాబాయ్ ఆశయాలకు అనుగుణంగా నేను నడుచుకుంటాను. సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) కూడా సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు’ అని తారకరత్న చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత కార్యక్రమంలో తారకరత్న మాట్లాడుతూ పై కామెంట్స్ చేశారు.
తారకరత్న మరణంతో.. ఆయన మాట్లాడిన మాటలను అభిమానులు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అయ్యో పాపం నందమూరి కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తు్న్నారు.. రానున్న ఎన్నికల్లో పోటీ కూడా చేయాలకున్నారు కానీ చివరి కోరిక తీరకుండా దేవుడు ఇలా చేశాడేంటి..? అని కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.
****************************************
ఇవి కూడా చదవండి..
Big Breaking : నందమూరి కుటుంబంలో పెను విషాదం.. తారకరత్న కన్నుమూత..
****************************************
Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!
Updated Date - 2023-02-18T23:45:12+05:30 IST