Chandrababu : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి.. ఎక్స్‌క్లూజివ్ ఫొటో..
ABN, First Publish Date - 2023-11-07T16:13:57+05:30
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు కంటి ఆపరేషన్ (CBN Eye Operation) పూర్తయ్యింది. మంగళవారం నాడు.. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో (LV Prasad Hospital) కుడి కంటికి సంబంధించిన కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు. 45 నిమిషాల్లోనే ఈ చికిత్స పూర్తి చేసినట్లు తెలిసింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు కంటి ఆపరేషన్ (CBN Eye Operation) పూర్తయ్యింది. మంగళవారం నాడు.. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో (LV Prasad Hospital) కుడి కంటికి సంబంధించిన కాటరాక్ట్ ఆపరేషన్‌ను వైద్యులు పూర్తి చేశారు. 45 నిమిషాల్లోనే ఈ చికిత్స పూర్తి చేసినట్లు తెలిసింది. కాగా.. చికిత్స అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చంద్రబాబు (Chandrababu) చేరుకున్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్లు తెలియవచ్చింది. ఆపరేషన్ తర్వాత వైద్యులతో కలిసి చంద్రబాబు దిగిన ఫొటోను ‘ఆంధ్రజ్యోతి’ ఎక్స్‌క్లూజివ్‌గా (Exclusive) సంపాదించింది. తనకు విజయవంతంగా ఆపరేషన్ సందర్భంగా వైద్యులతో కలిసి టీడీపీ అధినేత (TDP Chief) ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోను టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ (Viral) చేసుకుంటున్నారు. బాబు త్వరగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు, వీరాభిమానులు పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు.. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదిగా బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
బెయిల్‌పై ఇలా..?
కాగా.. స్కిల్ అక్రమ కేసులో అరెస్ట్ అయిన బాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Central Jail) ఉన్నారు. జైలుకు వెళ్లినప్పటి నుంచి డీహైడ్రేషన్, చర్మ సంబంధిత వ్యాధులు,బరువు తగ్గడం, కంటి చూపుతో బాధపడుతుండటంతో మధ్యంతర బెయిల్ (Interm Bail) ఇవ్వాలని ఏపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు ఎంత నిర్లక్ష్యం వహించారో టీడీపీ నేతలు పలుమార్లు మీడియా ముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే. బాబు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కంటి ఆపరేషన్ నిమిత్తం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. చికిత్సలు, విశ్రాంతి పూర్తయ్యాక మళ్లీ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సి ఉంది.
ఆస్పత్రికి వెళ్లి..!
బెయిల్‌పై బయటికి వచ్చిన బాబు.. మొదట నగరంలోని ప్రముఖ ఆస్పత్రి అయిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత మరో రోజు వైద్య నిపుణులతో మాట్లాడి వైద్యం తీసుకున్నారు. చర్మ సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకున్నట్లు సమాచారం. అక్కడ చికిత్స పూర్తయిన తర్వాత ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి మొదటి రోజు వెళ్లి పరీక్షలు చేయించుకున్న తర్వాత మంగళవారం నాడు బాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అటు ఏఐజీ, ఇటు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో రెండు దఫాలుగా వైద్య పరీక్షలు చేసి.. వైద్యులు చికిత్స అందించారు. చంద్రబాబుకు వైద్యం, ఆపరేషన్ అన్నీ సవ్యంగా జరగడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ.. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Updated Date - 2023-11-07T16:27:31+05:30 IST