ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Schedule : చంద్రబాబు రెండ్రోజుల షెడ్యూల్ ఇదే.. సడన్‌గా మారిపోయిందే..!?

ABN, First Publish Date - 2023-10-31T22:51:37+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. ఆయన రాకతో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ.. ఢిల్లీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పండగ చేసుకున్నారు..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చారు. ఆయన రాకతో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ.. ఢిల్లీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పండగ చేసుకున్నారు. ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాబు ‘విడుదల’కు సంబంధించిన వార్తలే.. ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయ్. ఇక అసలు విషయానికొస్తే.. బాబు బయటికొచ్చారు సరే.. బుధవారం, గురువారం ఏమేం చేయబోతున్నారు..? ఆయన షెడ్యూల్ ఏంటి..? అనేదానిపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


బాబు మొదట షెడ్యూల్ ఇలా..!

  • తిరుమలలో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

  • బుధవారం (నవంబర్-01న) రాత్రి 7గంటలకు తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు

  • రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న చంద్రబాబు

  • గురువారం ఉదయం తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం ఉదయం 9.30 గంటలకు వరాహస్వామి వారిని దర్శించుకోనున్న చంద్రబాబు

  • 10 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

  • గురువారం మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్ళనున్న చంద్రబాబు

  • 1.30 గంటలకు రేణిగుంట నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్న చంద్రబాబు

సడన్‌గా ఇలా..!

  • చంద్రబాబు తిరుమల పర్యటన రద్దు

  • చంద్రబాబును వైద్య పరీక్షలకు వెంటనే హైదరాబాద్‌ తీసుకురావాలని కుటుంబసభ్యులకు వైద్యుల సూచన

  • దీంతో తిరుమల పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

  • కోర్టు ఆదేశాలతో ఆరోగ్య పరీక్షలకు చంద్రబాబు హైదరాబాద్‌ వెళుతున్నారని అచ్చెన్నాయుడు ప్రకటన

  • చంద్రబాబుకు వైద్య పరీక్షలు వెంటనే చేయించాలని వైద్యుల సూచన

  • బుధవారం నాడు చంద్రబాబు ఎవరినీ కలవరని అచ్చెన్నాయుడు ప్రకటన

  • కోర్టు ఆదేశాలతో చంద్రాబాబు ఆరోగ్య పరీక్షల కోసం వెంటనే హైదారబాద్ బయలుదేరాలని నిర్ణయం

జనసంద్రంగా..

రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చంద్రబాబు రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకున్నారు. ఆలంపురం వద్ద తాడేపల్లిగూడెం, గోపాలపురం నియోజకవర్గాల కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. టీడీపీ అధినేత రాకతో జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. చంద్రబాబు కోసం బారులు జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద వేలాది ప్రజలు ఉన్నారు. తణుకు నుంచి దువ్వమీదుగా అధినేత కాన్వాయ్ ఆలంపురం మీదుగా తాడేపల్లిగూడెం శివార్లకు చేరుకోగానే కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేరింతలు కొట్టారు. అధినేత ప్రయాణిస్తున్న వాహనంపై ప్రజలు పూలు కురిపిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు.

ఎవ్వరినీ కలవరు!

చంద్రబాబు ఆరోగ్యపరీక్షలు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ‘పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరినీ చంద్రబాబు కలవరని, కార్యకర్తలు, నాయకులు ఈ విషయం గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్ పెట్టిన అక్రమ కేసుల వల్ల చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనో ధైర్యం కోల్పోకుండా అక్రమ అరెస్టును నిరసిస్తూ వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నేడు మన నాయకునికి బెయిల్ రావటం మనతోపాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిధ దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరం. ఇదే స్పూర్తి ముందు కూడా కొనసాగిద్దాం’ అని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి


NCBN : జైలు నుంచి బయటికొచ్చాక చంద్రబాబు తొలి ప్రసంగం.. ఆసక్తికర వ్యాఖ్యలు


CBN Release : జైలు నుంచి చంద్రబాబు విడుదల.. బయటికి ఎలా వచ్చారో చూడండి..


CBN : చంద్రబాబుకు మరో బిగ్ రిలీఫ్.. ఆనందంలో మునిగితేలుతున్న టీడీపీ శ్రేణులు


CBN Exclusive : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు.. వచ్చీ రాగానే ఏం చేశారంటే..?



Updated Date - 2023-10-31T22:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising