ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi Vs Kcr : కర్ణాటక ఫలితాలు, గవర్నర్ వ్యవస్థను ప్రస్తావించి మరీ కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

ABN, First Publish Date - 2023-05-27T16:02:09+05:30

కేసీఆర్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్‌ల (Bhagwant Mann Singh) భేటీ ముగిసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (TS CM KCR) వ్యాఖ్యానించారు. శనివారం నాడు కేసీఆర్‌తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్‌ల (Bhagwant Mann Singh) భేటీ ముగిసింది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, కేంద్రం ఆర్డినెన్స్‌పై (Central Ordinance) ముగ్గురు ముఖ్యమంత్రులు నిశితంగా చర్చించారు. అనంతరం ముగ్గురూ కలిసి ప్రగతిభవన్ వేదికగా జాయింట్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. మొదట సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కర్ణాటకలో (Karnataka Election Results) కర్రుకాల్చి వాతపెట్టినా కేంద్రం మారకపోతే ఎలా..? అని ప్రశ్నించారు. దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితీమీరాయని కన్నెర్రజేశారు. బేజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఏందీ గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ పదవి అలంకారప్రాయమైన పదవి. బడ్జెట్ పాస్ కానివ్వనని గవర్నర్ అంటే ఎలా..?. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇంత ధౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉంటదా..?’ అని కేంద్రంపై కేసీఆర్ కన్నెర్రజేశారు.

మీకై మీరు వెనక్కి తీసుకోండి..!

‘సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన ఆప్, మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజార్టీతో గెలిచింది. అయినా మేయర్ ప్రమాణస్వీకారం చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చింది. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్రం తెచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంట్ వేదికగా వ్యతిరేకిస్తాం. ఆర్డినెన్స్‌ను ప్రధాని వెనక్కి తీసుకోవాలి. ప్రజలు మోదీ సర్కార్‌కు గట్టిగా బుద్ధి చెబుతారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు. కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలి. గవర్నర్ వ్యవస్థను కూడా కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. అయినా సుప్రీం తీర్పును అమలు చేయకపోవడమేంటి..? మీకై మీరే ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోండి.. ఇది మీకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. అండమాన్ పాలనకు ఢిల్లీ పాలనకు చాలా తేడా ఉంది, సుప్రీం తీర్పును కేంద్రం గౌరవించకపోతే దేశం పరిస్థితేంటి..?’ అని కేంద్రంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంపై కన్నెర్ర..!

ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. బీజేపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా కేంద్రం లెక్కచేయడం లేదు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలిఅని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మరోవైపు భగవంత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకే అధికారాలు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గవర్నర్ వ్యవస్థను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్‌లను వాడుకుంటున్నారు అని కేంద్రం తీరుపై భగవంత్‌ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

BJP and BRS : కారు-కమలం నిజంగానే కలిసిపోతాయా.. ఇన్ని అస్త్రాలున్నా కేసీఆర్ నోరు మెదపకపోవడం వెనుక ఇంత కథుందా.. సడన్‌గా ఎందుకో ఇలా..!?

******************************

Jagan In YS Viveka Case : పెను సంచలనం.. వివేకా హత్యకేసులో సీఎం వైఎస్ జగన్ పేరు..

******************************

TS Politics : తెలంగాణ బీజేపీకి ఊహించని ఝలక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత.. స్క్రిప్ట్ మారుతోందే..!

******************************

Updated Date - 2023-05-27T16:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising