Telangana CS Somesh Kumar: సీఎస్ సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనన్న హైకోర్టు.. కొత్త సీఎస్ రేసులో ఆ ముగ్గురు...?
ABN, First Publish Date - 2023-01-10T18:54:48+05:30
తెలంగాణకు కొత్త సీఎస్ రాబోతున్నారా...? హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్త బాస్ వైపు కేసీఆర్ మొగ్గుచూపుతున్నారా...? ధరణి సహా పలు అంశాల్లో సీఎస్ సోమేష్ మెతక వైఖరిపై గుర్రుగా ఉన్న..
తెలంగాణకు (Telangana) కొత్త సీఎస్ (TS Chief Secretary) రాబోతున్నారా...? హైకోర్టు (High Court Verdict) తీర్పు నేపథ్యంలో కొత్త బాస్ వైపు కేసీఆర్ (KCR) మొగ్గుచూపుతున్నారా...? ధరణి సహా పలు అంశాల్లో సీఎస్ సోమేష్ మెతక వైఖరిపై గుర్రుగా ఉన్న కేసీఆర్... కొత్త వారి వైపే మొగ్గు చూపుతున్నారా...? అయితే ఆ రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ (Telangana CS Somesh Kumar) ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు (Telangana High Court) స్పష్టం చేసిన నేపథ్యంలో.. కొత్త బాస్ ఎవరు అన్న చర్చ ఊపందుకుంది. విభజనలో ఏపీకి వెళ్లిన సోమేష్ కుమార్... క్యాట్ ఆర్డర్ తో తెలంగాణలో కొనసాగుతున్నారు. సీఎస్‌గా కూడా ప్రమోషన్ పొందిన ఆయన ఈ ఏడాది చివరి వరకు పదవిలో ఉండాల్సింది. కానీ, హైకోర్టు తీర్పు తర్వాత కేసీఆర్ కూడా సోమేష్ కుమార్‌ను వదిలించుకునేందుకే మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తీర్పు రాగానే సోమేష్ కుమార్ హుటాహుటిన కేసీఆర్‌తో గంట పాటు భేటీ అయ్యారు.
సుప్రీంకోర్టులో అప్పీల్ సహా పలు న్యాయపరమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో ప్రభుత్వంపై వ్యతిరేక ఉన్న అంశాల్లో ధరణి కూడా ఒకటి. ధరణిని డీల్ చేయటంలో సోమేష్ ఫెయిల్ అయ్యారన్న చర్చ సీసీఎల్ఏ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై కేసీఆర్ కూడా గుర్రుగా ఉన్న ప్రచారం జరిగింది. ఇవన్నింటి నేపథ్యంలో.. కొత్త సీఎస్ వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సీఎస్ రేసులో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే అరవింద్ కుమార్‌తో పాటు మరో సీనియర్ అధికారి రామకృష్ణరావు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, న్యాయశాఖ సలహా మేరకే తదుపరి కార్యచరణ ఉండే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలంటున్నాయి.
Updated Date - 2023-01-10T19:01:53+05:30 IST