కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy : చంద్రబాబు జైలుకెళ్లడంపై బిగ్ డిబేట్‌లో రేవంత్ ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-11-16T22:33:36+05:30

Revanth Reddy On Chandrababu Arrest : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో జగన్ సర్కార్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు..

Revanth Reddy : చంద్రబాబు జైలుకెళ్లడంపై బిగ్ డిబేట్‌లో రేవంత్ ఏమన్నారంటే..?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో జగన్ సర్కార్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు.. అనారోగ్యంతో మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చి చికిత్సలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి పలు చికిత్సలు, ఎల్వీ ప్రసాద్‌లో కంటికి ఆపరేషన్ చేయించుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం తన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి.. జైల్లో ఉన్నప్పుడు, బయటికి రావడంపై పలు పార్టీల అధిపతులు, నేతలు పలు రకాలుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేకంగా నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ వేదికగా స్పందించారు.


Revanth-And-MD.jpg

బాధగా ఉంది..!

చంద్రబాబు జైలుకు వెళ్ళడం కరెక్టా..? కాదా..? అని చర్చించను. చంద్రబాబు జైలుకు వెళ్లడం తనకు వ్యక్తిగతంగా బాధని అనిపించింది. చంద్రబాబు అరెస్టును ఏపీ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టును లాభనష్టాలతో చూడం. చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆందోళన చేయవద్దని బెదిరించారు. ఆంధ్రావాళ్లను సెటిలర్స్ అంటూ వేరుచేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ మాటలు వారికి నష్టం కల్గిస్తాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీలో ఉన్నారు. జనసేనకు తక్కువ ఓట్లువస్తే ఆప్రభావం ఏపీపై ఉంటుంది’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

రేవంత్ ఇంకా ఏమేం మాట్లాడారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి..

Updated Date - 2023-11-16T22:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising