Revanth Reddy Padayatra: రేవంత్ పాదయాత్ర... సీనియర్లు వెనక్కి తగ్గక తప్పదా?
ABN, First Publish Date - 2023-01-07T18:43:37+05:30
పీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేశారు. జనవరి 26 నుండి జూన్ 2 వరకు పాదయాత్ర చేయబోతున్నట్లుగా ప్రకటించేశారు కూడా. ఏకపక్షంగా అలా ఎలా ప్రకటించేస్తారు అని సీనియర్లు గగ్గోలు పెడుతున్నా..
టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రకు (TPCC Chief Revanth Padayatra) ముహుర్తం ఖరారు చేశారు. జనవరి 26 నుండి జూన్ 2 వరకు పాదయాత్ర చేయబోతున్నట్లుగా ప్రకటించేశారు కూడా. ఏకపక్షంగా అలా ఎలా ప్రకటించేస్తారు అని సీనియర్లు గగ్గోలు పెడుతున్నా.. రేవంత్ అండ్ టీం వారి ఏర్పాట్లలో వారు ఉండిపోయారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్ఫూర్తితో రోజుకు 19కి.మీ పాదయాత్ర చేయాలని, దాదాపు 120 రోజులకు పైగా యాత్ర ప్రతి తెలంగాణ మూలను టచ్ చేసేలా ఉండేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. అధిష్టానం రేవంత్ కు అనుమతి ఇవ్వలేదని సీనియర్ల చెప్పుకుంటున్నా.. రేవంత్ మాత్రం యాత్రకు రెడీ అయిపోయారు.
గతంలోనూ రేవంత్ యాత్ర తెరపైకి వచ్చినప్పుడు ఎంపీ కోమటిరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు తాము యాత్ర చేస్తామని, అనుమతి ఇవ్వాలని ముందుకొచ్చారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి రేసులో వెనకబడ్డా... రేవంత్ రెడ్డితో పాటు భట్టికి కలిసి పర్మిషన్ వస్తుందన్న ఆశలో సీనియర్లున్నారు. తన పాదయాత్ర గురించి రేవంత్ అధిష్టానం వద్ద మాట తీసుకొని ఉండొచ్చని, యాత్రకు ఆటంకాలు లేకుండా కేసీఆర్ పై సమరశంఖం పూరించే ఎత్తుగడలోనే రేవంత్ కూడా తనకు పదవి ముఖ్యం కాదని ప్రకటన చేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడున్న చాలా మంది సీనియర్లు పాదయాత్రలో పూర్తిగా పాల్గొనే అవకాశం లేదు.
భారత్ జోడో యాత్రకు వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా అధినాయకత్వం కూడా యాత్రను ఆపండి అని ఆదేశించకపోవచ్చని, ఎన్నికల ఏడాదిలో పోరాడే నేతకు కత్తి ఇవ్వక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఉమ్మడి యాత్రకు అనుమతి వస్తే సీనియర్లకు కాస్త ఉపశమనం మాత్రమే ఉంటుంది తప్పా రేవంత్ అడ్డుకున్నట్లు ఎలా అవుతుంది..? రేవంత్ అనుకున్నది నెరవేరినట్లే కదా...? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పైగా రేవంత్ ఆర్గనైజ్ చేసిన యాత్రలో భట్టి ఇమడగలరా అన్న చర్చ కూడా సాగుతుండగానే.. భద్రాచలం నుంచి యాత్ర స్టార్ట్ చేయాలని ఎమ్మెల్యే పోడెం వీరయ్య రేవంత్‌ను ఆహ్వానించటం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి యాత్ర స్టార్ట్ చేస్తే.. ఆదిలాబాద్ జోడేఘాట్ లేదా గద్వాల జోగులాంబ గుడి లేదా భద్రాచలం అనే మూడు ఆప్షన్స్ ఉన్నాయని రేవంత్ అనుచరగణం ప్రచారం చేసుకుంటోంది.
Updated Date - 2023-01-07T21:14:31+05:30 IST